Prabhas | 2027 ప్రభాస్ నామ సంవత్సరం కానుందా..?
Prabhas | 2027 ప్రభాస్ నామ సంవత్సరం కానుందా..?
2027 ప్రభాస్ ఫ్యాన్స్ కి పండగే..
Prabhas | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఏమాత్రం గ్యాప్ లేకుండా వరుసగా సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. రెండు సినిమాలు షూటింగ్స్ లో ఉంటే.. మరో రెండు సినిమాలు సెట్స్ పైకి వచ్చేందుకు రెడీగా ఉంటాయి. మరో రెండు సినిమాలు ఫైనల్ అయి ప్రభాస్ డేట్స్ కోసం వెయిట్ చేస్తుంటాయి. ఇంతలా ప్రభాస్ వర్క్ చేస్తుంటారు. ఇదిలా ఉంటే.. నెక్ట్స్ ఇయర్ 2027 డార్లింగ్ ఫ్యాన్స్ కి పండగే అంటూ ఇండస్ట్రీ జనాల్లో టాక్ వినిపిస్తోంది. ఇంతకీ.. ప్రభాస్ ప్లాన్ ఏంటి..?
ప్రభాస్ ఇచ్చిన మాట..
ప్రభాస్.. అభిమానులకు మాట ఇచ్చారు. అదేంటంటే.. వీలైనన్ని ఎక్కువ సినిమాలు చేసి అభిమానులను అలరించడానికి ప్రయత్నిస్తాను. ఖచ్చితంగా సంవత్సరానికి రెండు సినిమాలు రిలీజ్ చేస్తానని స్వయంగా ప్రభాస్ ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పారు. ఈ ఇయర్ లో ప్రభాస్ ది రాజాసాబ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మారుతి తెరకెక్కించిన ఈ సినిమా సంక్రాంతికి రిలీజైంది. బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధిస్తుంది అనుకుంటే.. ఏమాత్రం అంచనాలను అందుకోలేకపోయింది. బాక్సాఫీస్ దగ్గర బోల్తాపడింది. ఇక ఆతర్వాత ఫౌజీ ఈ ఇయర్లోనే రిలీజ్ అవుతుందని ప్రచారం జరిగింది కానీ.. నెక్ట్స్ ఇయర్లోనే రానుందని టాక్ వినిపిస్తోంది.
సంక్రాంతికి ఫౌజీ…?
ప్రభాస్, హను రాఘవపూడి.. ఈ ఇద్దరి కాంబోలో రూపొందుతోన్న భారీ చిత్రం ఫౌజీ. ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. ఇందులో ప్రభాస్ బ్రిటీష్ సైనికుడుగా నటించనున్నాడని ప్రచారం జరుగుతుంది కానీ.. అంతకు మించి ఈ సినిమా కథ గురించి వివరాలు బయటకు రాలేదు. దీంతో ఫౌజీ మూవీ పై మరింత ఆసక్తి ఏర్పడింది. అయితే.. ఈ సినిమాని ఆగష్టులో విడుదల చేయాలి అనుకున్నారు. ఆతర్వాత అక్టోబర్ లో దసరాకి వస్తుందని టాక్ వినిపించింది. దసరాకి కాదు.. క్రిస్మస్ కి రిలీజ్ అని టాక్ వచ్చింది కానీ.. 2027 జనవరిలో సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుందని సమాచారం.

స్పిరిట్ రావడం ఖాయం..
ఫౌజీ తర్వాత ప్రభాస్ రానున్న సినిమా స్పిరిట్. సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ తెరకెక్కిస్తున్న ఈ మూవీ చాలా ఫాస్ట్ గా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ మూవీకి సంబంధించి ఆడియో రూపంలో డైలాగ్ రిలీజ్ చేసినప్పటి నుంచి మరింత క్యూరియాసిటీ పెరిగింది. అయితే.. ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేసిన తర్వాత 2027 మార్చి 5న రిలీజ్ అని సందీప్ రెడ్డి వంగ అనౌన్స్ చేశారు. ఈ రిలీజ్ డౌట్ అనౌన్స్ చేసిన తర్వాత కూడా అనుకున్న ప్లాన్ ప్రకారం షూటింగ్ జరగదు.. మార్చి 5న స్పిరిట్ విడుదల కాదు అంటూ ప్రచారం జరిగింది. అయితే.. ప్రచారంలో ఉన్న వార్తలను సందీప్ రెడ్డి వంగ ఖండించారు. మార్చి 5న స్పిరిట్ రిలీజ్ అవుతుందని మరోసారి కన్ ఫర్మ్ చేశారు.

బాహుబలి ది ఎటర్నల్ వార్..
ఫౌజీ, స్పిరిట్ సినిమాలతో పాటు బాహుబలి యానిమేషన్ మూవీ బాహుబలి ది ఎటర్నల్ వార్ కూడా 2027 లోనే విడుదల కానుందని సమాచారం. ఈ లెక్కన 2027లో ప్రభాస్ నుంచి మూడు సినిమాలు రిలీజ్ అయితే.. డార్లింగ్ ఫ్యాన్స్ కి పండగే. మరి.. ఈ మూడు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఏ రేంజ్లో సెన్సేషన్ క్రియేట్ చేస్తాయో చూడాలి.
