politics | 11వ వార్డులో గంగా హనుమండ్లు ఘన విజయం

politics | 11వ వార్డులో గంగా హనుమండ్లు ఘన విజయం

politics | తంగళ్ళపల్లి, ఆంధ్రప్రభ : తంగళ్ళపల్లి గ్రామ రాజకీయాల్లో(politics) అరుదైన, ఆదర్శవంతమైన విజయానికి 11వ వార్డు సాక్ష్యమైంది. ఓటర్‌పై ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకుండా, కేవలం నమ్మకం, నిజాయితీ, సేవా సంకల్పంతో గంగా హనుమండ్లు సంచలన విజయం(success) సాధించారు.

డబ్బు, దుబారా, ప్రలోభాలకు చోటు లేని ప్రచారంతో ప్రజల హృదయాలను గెలుచుకున్న గంగా హనుమండ్లు చివరి క్షణం వరకు ఉత్కంఠ కొనసాగిన పోటీలో విజయం ఖరారు చేసుకున్నారు. ఈ ఫలితం ప్రజాస్వామ్యంలో విలువలు ఇంకా బ్రతికే ఉన్నాయనే నమ్మకాన్ని బలపరిచింది. ఈ విజయం తన వ్యక్తిగత గెలుపు కాదని, నిజాయితీకి, ప్రజల విశ్వాసానికి లభించిన గెలుపని గంగా హనుమండ్లు తెలిపారు.

11వ వార్డు అభివృద్ధి, ప్రతి కుటుంబ సమస్యకు(problem) పరిష్కారం దిశగా నిరంతరం పనిచేస్తానని హామీ ఇచ్చారు. ఓటర్‌పై ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకుండా వచ్చిన ఈ గెలుపు, తంగళ్ళపల్లి రాజకీయాల్లో ఆదర్శంగా నిలిచి, భవిష్యత్ నాయకులకు మార్గదర్శకంగా మారింది.

Leave a Reply