పొలిటికల్ పార్టీలు నియమ, నిబంధనలు పాటించాల్సిందే

పొలిటికల్ పార్టీలు నియమ, నిబంధనలు పాటించాల్సిందే

న్యూఢిల్లీ, ఆంధ్ర‌ప్ర‌భ : ప్రతి రాజకీయ పార్టీ తన అధికారిక వెబ్‌సైట్ హోమ్ పేజీలో తన మెమోరాండం, నియమాలు, నిబంధనలను ప్రచురించేలా చూడాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై సుప్రీంకోర్టు (Supreme Court) సోమవారం భారత ఎన్నికల సంఘం (Election Commission of India), కేంద్రానికి నోటీసు జారీ చేసింది. ఈ పిటిషన్‌ను సీనియర్ న్యాయవాది అశ్విని కుమార్ ఉపాధ్యాయ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. రాజకీయ పార్టీలను నియంత్రించాలని కోరుతూ తాను పిల్ దాఖలు చేశారు. దీనిపై పార్లమెంటు చట్టం చేసే వరకు, సుప్రీంకోర్టు మార్గదర్శకాలను రూపొందించాలని స్పష్టం చేశారు.

Leave a Reply