కల్వకుర్తి ఎన్‌పీఆర్‌డీ అధ్యక్షుడిగా పోలె లక్ష్మణ్

ఊర్కొండ, ఆంధ్రప్రభ : వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (ఎన్‌పీఆర్‌డీ) కల్వకుర్తి నియోజకవర్గ నూతన అధ్యక్షుడిగా నాగర్‌కర్నూల్ జిల్లా ఊర్కొండ మండలం నర్సంపల్లికి చెందిన పోలె లక్ష్మణ్ నియమితులయ్యారు. హైదరాబాద్‌లోని రాష్ట్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో జాతీయ అధ్యక్షుడు తుడుం రాజేందర్, రాష్ట్ర అధ్యక్షుడు దైనంపల్లి మల్లికార్జున్ లక్ష్మణ్‌కు నియామక పత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా పోలె లక్ష్మణ్ మాట్లాడుతూ నియోజకవర్గంలో వికలాంగుల హక్కులు, సంక్షేమం కోసం కృషి చేస్తానని తెలిపారు. వికలాంగుల సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.