గుంతలను వెంటనే పూడ్చాలి: ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌రెడ్డి
వలిగొండ, ఆంధ్రప్రభ : ఇటీవల కురిసిన భారీ వర్షాలకు భువనగిరి–చిట్యాల ప్రధాన రహదారిపై ఏర్పడిన గుంతలను సోమ, మంగళవారాల్లోపు పూర్తి స్థాయిలో పూడ్చి, వాహనదారులకు ఇబ్బందులు లేకుండా రహదారిని సౌకర్యవంతంగా మార్చాలని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి కాంట్రాక్టర్, ఆర్అండ్బీ అధికారులను ఆదేశించారు. శనివారం సాయంత్రం అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. వర్షాల కారణంగా రహదారి దెబ్బతిన్న ప్రాంతాలను వెంటనే పరిశీలించి మరమ్మతు పనులు చేపట్టాలని సూచించారు. ప్రజలు, వాహనదారులు ఇబ్బందులు పడకుండా పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు.
