ఎల్కతుర్తి ఎమ్మార్పీఎస్ నూతన కమిటీ ఏర్పాటు..
ఎల్కతుర్తి, ఆంధ్రప్రభ: ఎల్కతుర్తి మండల ఎమ్మార్పీఎస్ నూతన కమిటీని ఆదివారం ఏర్పాటు చేశారు. సెప్టెంబర్ 9న వరంగల్‌లో నిర్వహించనున్న ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ నూతన మండల కమిటీల జాతీయ సదస్సును విజయవంతం చేయడంతోపాటు, పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు మండల స్థాయిలో ఉద్యమాన్ని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా కమిటీని ఏర్పాటు చేసినట్లు జిల్లా ఇన్చార్జి ఏపూరి వెంకటేశ్వరరావు మాదిగ తెలిపారు. మాజీ జిల్లా అధ్యక్షుడు గద్దల సుకుమార్ మాదిగ అధ్యక్షతన జరిగిన మండల కమిటీ నిర్మాణ సదస్సుకు జిల్లా ఇన్చార్జి ఏపూరి వెంకటేశ్వరరావు మాదిగ ముఖ్యఅతిథిగా, జిల్లా కో-ఇన్చార్జి తడుగుల విజయ్ మాదిగ, ఎంఎస్పీ జిల్లా మాజీ అధ్యక్షుడు బండారి సురేందర్ మాదిగ గౌరవ అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సెప్టెంబర్ 9న వరంగల్‌లో జరిగే జాతీయ సదస్సుకు నూతన మండల కమిటీ సభ్యులు, ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ శ్రేణులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. భవిష్యత్తులో పద్మశ్రీ మందకృష్ణ మాదిగ తీసుకునే ఉద్యమ నిర్ణయాలను విజయవంతం చేయడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. అనంతరం నిర్వహించిన మండల కమిటీ ఎన్నికల్లో ఎమ్మార్పీఎస్ ఎల్కతుర్తి మండల అధ్యక్షుడిగా అడ్డూరి అనిల్ మాదిగ, ఎంఎస్పీ మండల అధ్యక్షుడిగా కొయ్యడ రాజేందర్ మాదిగ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
అధికార ప్రతినిధిగా జూపాక మధుకర్ మాదిగ, ప్రధాన కార్యదర్శులుగా చదిరం రాకేష్ మాదిగ, ఎల్తూరి వినయ్ మాదిగ, ఉపాధ్యక్షులుగా ఆరేపల్లి శ్రీనివాస్ మాదిగ, బొంకూరి కార్తీక్ మాదిగ, ఆరేపల్లి రమేష్ మాదిగ, కోశాధికారిగా సందెల చందు మాదిగ, కార్యదర్శులుగా చిలుముల వినోద్ మాదిగ, మేకల రాజ్‌కుమార్ మాదిగ, కట్కూరి శివకుమార్ మాదిగ, మాటూరి కార్తీక్ మాదిగ ఎన్నికయ్యారు. సహాయక కార్యదర్శులుగా గొర్రె చరణ్ మాదిగ, మారుపాక తరుణ్ మాదిగ, సండ్ర పవన్ మాదిగ ఎన్నికయ్యారు. నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులను నాయకులు అభినందించారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ అనుబంధ సంఘాల నాయకులు, ఉద్యమ శ్రేణులు, కుటుంబ సభ్యులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.
