మొక్కలునాటి, పర్యావరణాన్ని కాపాడుకోవాలి..
చిట్యాల, ఆంధ్రప్రభ : ప్రతి ఒక్కరూమొక్కలు నాటి, పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలని ఏఆర్ పల్లి సర్పంచ్ కొడారి అశోక్ కోరారు.శుక్రవారం,అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవ సందర్భంగా ఏలేటి రామయ్యపల్లి గ్రామపంచాయతీలో గ్రామసభ ఏర్పాటు చేశారు. తడి చెత్త, పొడి చెత్త వేరు చేయడం, గ్రామంలో ప్రతి ఇంట్లో చెట్లను నాటాలని సర్పంచ్ అశోక్ కోరారు. పల్లె ప్రకృతి వనంలో గ్రామపంచాయతీ పాలకవర్గం తో కలిసి చెట్లు నాటారు. అనంతరం చెత్తాచెదారం తొలగించారు. పర్యావరణాన్ని కాపాడితే అది మనల్ని కాపాడుతుంద ని తెలిపారు .కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి దేవేందర్, వార్డు సభ్యులు మర్రి రమేష్, కసిరెడ్డి ఉమా, కొత్తూరీ మైపాల్, మహిళా సంఘాల అధ్యక్షురాలు ఏలేటి కవిత , గ్రామస్తులు, పంచాయతీ సిబ్బంది, పాల్గొన్నారు.
