శివనగర్ లో అర్ధరాత్రి పెట్రోల్ దొంగలు..

కరీమాబాద్, ఆంధ్రప్రభ ; గ్రేటర్ వరంగల్ 34వ డివిజన్ శివనగర్లో అర్ధరాత్రి పెట్రోల్ దొంగలు రెచ్చిపోతున్నారు. శివనగర్ లోని ప్రకాష్ మెమోరియల్ హైస్కూల్ సమీపంలో సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ, దొంగలు భయం లేకుండా పెట్రోల్ దొంగిలిస్తున్నారు.

ఈ సంఘటనతో ఇంటి ముందు ద్విచక్ర వాహనాలు పార్కింగ్ చేయాలంటే ప్రజల్లో భయాందోళనలు చోటు చేసుకున్నాయి. పెట్రోల్ దొంగలు ఎలాంటి భయం లేకుండా నిర్భయంగా ఇంటి ముందర పార్కింగ్ చేసిన వాహనాల నుండి పెట్రోలు చోరీ చేస్తున్నారు.

ప్రజల ప్రముత్తంగా ఉండి గేటు లోపలనే బండ్లు పార్కింగ్ చేసుకోవలసి వస్తుంది. స్థానిక పోలీసులు స్పందించి పెట్రోలింగ్ పెంచాలని వాహనదారులు విజ్ఞప్తి చేస్తున్నారు.