Pensioners | నకారాకు ఘన నివాళి

Pensioners | నకారాకు ఘన నివాళి

  • పెన్షనర్ల ఆకాంక్షలు కూటమి ప్రభుత్వం నెరవేర్చుతుంది
  • నియోజకవర్గ యువ నాయకులు మండలి వెంకట్రామ్
  • ఘనంగా పెన్షనర్ల దినోత్సవం

Pensioners | అవనిగడ్డ, ఆంధ్ర‌ప్ర‌భ : పెన్షనర్ల ఆకాంక్షలు కూటమి ప్రభుత్వం నెరవేర్చుతుందని నియోజకవర్గ యువనాయకులు మండలి వెంకట్రామ్ అన్నారు. బుధవారం అవనిగడ్డలో పెన్షనర్ల కార్యాలయంలో పెన్షనర్స్(Pensioners) దినోత్సవం ఘనంగా నిర్వహించారు. పెన్షన్ల సాధకుడు డీఎస్ నకారా చిత్రపటానికి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా వెంకట్రామ్ మాట్లాడుతూ పెన్షనర్ల అసోసియేషన్ పెద్దలు పెన్షనర్లకు అందిస్తున్న సేవలు అభినందనీయమ‌న్నారు. ముఖ్యంగా ఈరోజుల్లో సైబర్ నేరగాళ్ళు(cyber criminals), డిజిటల్ అరెస్ట్ మోసగాళ్ళ వలలో చిక్కి అనేకమంది పెన్షనర్లు లక్షలాది రూపాయలు పోగొట్టుకుంటున్న నేపథ్యంలో పెన్షనర్లకు పోలీస్ శాఖ ద్వారా అవగాహన కలిగించటం మంచి కార్యక్రమం అన్నారు.

Leave a Reply