Toll Free Number 1930 | సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి…

Toll Free Number 1930 | సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి…
Toll Free Number 1930 | కరీమాబాద్, ఆంధ్రప్రభ : నగరంలోని కరీమాబాద్ ప్రాంతంలో గల న్యూ కౌటిల్యాస్ సెయింట్(New Kautilyas St) ఆమన్ హై స్కూల్లో సైబర్ నేరాల పట్ల అవగాహన కార్యక్రమాన్ని స్థానిక మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ ఎస్ఐ శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలోనిర్వహించారు. ఈ రోజు కౌటిల్య హై స్కూల్ ప్రాంగణంలో సభాధ్యక్షులు పాఠశాల కరస్పాండెంట్ కోడం శ్రీధర్ పర్యవేక్షణలో జరిగింది.
ఈ సందర్భంగా స్థానిక మిల్స్ కాలని పోలీస్ స్టేషన్ నుండి సైబర్ విభాగపు పోలీసులు హెడ్ కానిస్టేబుల్ తయ్య బ్ అలీ కానిస్టేబుళ్లు చంద్రశేఖర్ ‘ ప్రదీప్ .విద్యార్థినీ విద్యార్థులకు అవగాహన తరగతులను నిర్వహించి వారిని జాగ్రత్త పరిచారు. ఎస్సై శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ.. టోల్ ఫ్రీ నెంబర్ 1930(Toll Free Number 1930) ఆవశ్యక, మొబైల్ ఫోను ఉపయోగించే విధానము ఆన్లైన్, ఆఫ్లైన్ గేమింగ్ విధానాలను వివరించారు. ఎటువంటి ఏపీకే ఫైల్స్ డౌన్లోడ్ చేయరాదన్నారు.
ప్రస్తుత సమాజంలో జరుగుతున్న మొబైల్ రీల్స్(Mobile Reels) / ఇన్స్టాగ్రామ్ / ఫేస్బుక్ లాంటి అనవసరమైన ఆప్ లను వినియోగించరాదన్నారు. ముఖ్యంగా ఇంటిలోఉండే మహిళలు, అమ్మాయిలు తమ తమ సొంత సమాచారం ఫోటోలు వీడియోలు ఇతరులతో పంచుకోరాదని అన్నారు. వారు ఆన్లైన్ పట్ల తీసుకోవలసిన జాగ్రత్తలను గురించి వివరించారు సైబర్ నేరాల పట్ల అప్రమత్తత అవసరమని అన్నారు.
కోడం శ్రీధర్ మాట్లాడుతూ.. నేటి సమాజంలో జరుగుతున్న అన్యాయాలు దొంగతనాలను అరికట్టవలసిన బాధ్యత భావి భారత పౌరులైన నేటి విద్యార్థులపై ఎంతో ఉందన్నారు సైబర్ నేరాల పట్ల అవగాహన కలిగి ఉండాలని అన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు , విద్యార్థులు,తల్లిదండ్రులు పాల్గొన్నారు.
