Parakala | సమస్యలకు శాశ్వత పరిష్కారం

Parakala | సమస్యలకు శాశ్వత పరిష్కారం

  • బీఆర్ఎస్ 9వ వార్డు అభ్యర్థి బండారి కవిత కృష్ణ

Parakala | పరకాల, ఆంధ్రప్రభ : పట్టణంలోని 9వ వార్డ్ లో బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన బండారి కవిత కృష్ణ విస్తృత ప్రచారం నిర్వహించారు. వార్డులోని ఓటర్లను కలుస్తూ వార్డు సమస్యలు తెలుసుకుంటూ సమస్యలను శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తానని బిఆర్ఎస్ 9వ వార్డు అభ్యర్థి బండారి కవిత కృష్ణ ఓటర్లకు కోరారు. పట్టణంలోని 9వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి బండారి కవిత కృష్ణ ఆధ్వర్యంలో ఇంటింటి విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… శ్రీనివాస కాలనీ మమత నగర్ వరద ముంపు నుండి తప్పించేందుకు కృషి చేస్తానన్నారు. గతంలో రాజకీయ అనుభవంతో వార్డు అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. వార్డులో ఇంటింటా పర్యటిస్తూ ప్రజలను ఆప్యాయంగా పలకరించి, ఓటర్ల మద్దతు కోరారు. వార్డులోని ఓటర్లకు ఎల్లవేళల సేవలు చేస్తానని అభ్యర్థి బండారి కవిత కృష్ణ అన్నారు. అభ్యర్థి వెంట బిఆర్ఎస్ నాయకులు, నాయకురాళ్లు, కార్యకర్తలు పాల్గొన్నారు.