Hospital |18వందల మంది రోగులు…

Hospital |18వందల మంది రోగులు…
Ranga Reddy | చేవెళ, ఆంధ్రప్రభ : డీమ్డ్ యూనివర్సిటీ(Deemed University)గా పట్నం మహేందర్ రెడ్డి మెడికల్ కాలేజ్ ను తీర్చిదిద్దడం జరుగుతుందని కళాశాల చైర్మన్ పట్నం మహేందర్ రెడ్డి వెల్లడించారు. చేవెళ్ల పట్నం మహేందర్ రెడ్డి మెడికల్ కాలేజ్, ఆసుపత్రిలో ఈ రోజు ఒరియేంటేషన్ కార్యక్రమం జరిగింది. ఈ కాలేజీలో వైద్యవిద్య ప్రమాణాల గురించి కాలేజీ సూపరిండెంట్ రామకృష్ణారెడ్డి(Ramakrishna Reddy) వివరించారు.
ఈ సందర్భంగా పట్నం మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. దేశంలోనే అత్యుత్తమ మెడికల్ కాలేజ్‌గా తీర్చిదిద్దెందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. అనుభవం ఉన్న ప్యాకల్టీ అందుబాటులో ఉన్నారనీ, వైద్యలను దేవునితో సమానంగా చూస్తామన్నారు. పేదలకు మెరుగైన వైద్య సేవలను అందించాలన్నారు. ప్రణాళిక బద్దంగా చదివితే ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చని చెప్పారు. కళాశాలలో ఉత్తమమైన వైద్య పరికరాలు, మెరుగైన బోధన, ప్రయోగశాలలు(Laboratories) కల్పించడం జరిగిందని అన్నారు.
ప్రతిరోజు మెడికల్ కాలేజీకి దాదాపు 18వందల మంది రోగులు వస్తున్నారని, వారికి ఉత్తమైన వైద్య సేవలు అందిస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్, ఎస్ఆర్ ఎడ్యుకేషనల్ డైరెక్టర్ వరదారెడ్డి, ప్రిన్సిపల్ జో్యారాణి, అకాడమిక్ డైరెక్టర్ గౌరీ(Academic Director Gauri), వైస్ ప్రిన్సిపల్ రాజేశ్వర్ రావు, జీఎం నాగేష్, ఏజీఎం రవి వర్మ, సిఓఓ అజీమ్, ఏఎంసి మాజీ వైస్ చైర్మన్ మాసన్నగారి మాణిక్య రెడ్డి, ఏవో వినోద్ కిరణ్ అనిల్, విక్రమ్ తదితరులు పాల్గొన్నారు.
