Former MLA | బాధిత కుటుంబాలకు పరామ‌ర్శ‌….

Former MLA | బిక్కనూర్, ఆంధ్రప్రభ : బాధిత కుటుంబాలను కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ఈ రోజు పరామర్శించారు. మండలంలోని భగీరత్ పల్లి గ్రామ మాజీ సర్పంచి నాగలక్ష్మి భర్త స్వామీ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న గోవర్ధన్ వారి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. అనంతరం అయ్యవారిపల్లి గ్రామంలో బాధిత కుటుంబాలను పరామర్శించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… పార్టీ నాయకులకు కార్యకర్తల కుటుంబాలకు తాను ఎల్లవేళలా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ధైర్యం కోల్పోకుండా ఉండాలని సూచించారు. ఆయన వెంట మండల బిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, పెద్ద మల్లారెడ్డి గ్రామ సర్పంచ్ సాయ గౌడ్, నాయకులు మహేందర్ రెడ్డి, వేణు, పాల రామచంద్రం, శ్రీనివాస్, పోతిరెడ్డి, యాదగిరి, నరసారెడ్డి, బూమ్ రెడ్డి తదితరులు ఉన్నారు.

Leave a Reply