మక్తల్ ఎస్‌ఐగా పి. రాజు బాధ్యతల స్వీకరణ

మక్తల్, ఆంధ్రప్రభ : మక్తల్ పోలీస్ స్టేషన్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ గా ఎస్ఐ పి. రాజు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఇతను ఇంతకుముందు దామరగిద్ద ఎస్సైగా బాధ్యతలు నిర్వహించి మక్తల్ ఎస్సైగా బదిలీపై ఇక్కడికి వచ్చారు. ఇంతకు ముందు మక్తల్ ఎస్సైగా విధులు నిర్వహించిన వై.భాగ్యలక్ష్మి రెడ్డి జిల్లా ఎస్పీ కార్యాలయానికి (విఆర్ ) బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా నూతన ఎస్సై పి. రాజు జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ ను ఎస్పీ కార్యాలయంలో పూల మొక్క అందించి మర్యాదపూర్వకంగా కలిశారు. ఎస్పీ నూతన ఎస్సైకి శుభాకాంక్షలు తెలియజేసి, మండల ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ శాంతిభద్రతల పరిరక్షణకు కట్టుబడి పనిచేయాలని సూచించారు.

ఈ సందర్భంగా ఎస్సై రాజు మాట్లాడుతూ… మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ స్నేహపూర్వక పోలీసింగ్ అమలు చేస్తామని పేర్కొన్నారు. ప్రజలు ఎలాంటి సమస్యలైనా నేరుగా పోలీస్ స్టేషన్‌కు వచ్చి తెలియజేయాలని సూచించారు. గ్రామాల్లో అక్రమ కార్యకలాపాలు, మత్తు పదార్థాల వినియోగం, పేకాట, గంజాయి రవాణా, ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలపై ప్రత్యేక నిఘా కొనసాగుతుందని ఆయన తెలిపారు. మహిళల భద్రతకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని, యువత చట్టవిరుద్ధ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని ఎస్ఐ పి.రాజు సూచించారు. నూతన ఎస్ఐగా బాధ్యతలు చేపట్టిన ఎస్ఐ పి.రాజును పలువురు ప్రజాప్రతినిధులు నాయకులు కలుసుకుని శాలువాతో ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు.

Leave a Reply