Peddapallli | సంక్షేమంలో మ‌న రాష్ట్ర‌మే నంబర్ వన్.. మహిళా కమిషన్ చైర్ ప‌ర్స‌న్ శారద

పెద్దపల్లి, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. సోమవారం కలెక్టరేట్ ఆవరణలోని పరేడ్ మైదానంలో మహిళా కమిషన్ చైర్ పర్సన్ నేరెళ్ల శారద జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో నిలిచిందన్నారు.

ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నామన్నారు. రైతులు పండించిన సన్నవ‌డ్ల‌కు 500 రూపాయల బోనస్ అందిస్తున్నామన్నారు. రేషన్ కార్డులపై ప్రజలకు దేశంలోనే ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా సన్నబియ్యం అందిస్తున్న రాష్ట్రం తెలంగాణ అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావుతో పాటు అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply