దివంగత నాయకుడు నూకల నరేష్ రెడ్డికి ఘన నివాళులు

దివంగత నాయకుడు నూకల నరేష్ రెడ్డికి ఘన నివాళులు

మరిపెడ, ఆంధ్రప్రభ: దివంగత మహానాయకుడు నూకల నరేష్ రెడ్డి జయంతి సందర్భంగా బుధవారం మరిపెడలో ఆయన విగ్రహానికి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో యువ నాయకుడు నూకల అభినవ్ రెడ్డితో కలిసి మరిపెడ మున్సిపల్ ఛైర్‌పర్సన్ వీసారపు ప్రగతి శ్రీపాల్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా నూకల నరేష్ రెడ్డి ప్రజా సేవలను, సమాజ అభివృద్ధికి చేసిన కృషిని స్మరించుకున్నారు. ఆయన ఆశయాలను కొనసాగిస్తూ ప్రజలకు మరింత సేవ చేయాలని నాయకులు పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ ఛైర్‌పర్సన్ కాలం సునీత రవీందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు పానుగోతు రాంలాల్, షేక్ అఫ్జల్, మెంచు అశోక్ కుమార్, అలువాల ఉపేందర్ (ప్రజాపతి), గంధసిరి భిక్షపతి, చెన్నూరు మహేష్, విజయ్, దూగుంట్ల వెంకన్న తదితరులు పాల్గొని నరేష్ రెడ్డి విగ్రహానికి నివాళులర్పించారు. జయంతి కార్యక్రమం సందర్భంగా నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై ఆయన సేవలను గుర్తుచేసుకుంటూ నివాళులు అర్పించారు.