Nine booths | అవగాహన ర్యాలీ

Nine booths | నాగాయలంక, ఆంధ్రప్రభ : పల్స్ పోలియో కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు నాగాయలంక పీహెచ్ సీ వైద్యాధికారి కె.శ్యామ్ ప్రసాద్ తెలిపారు. పీహెచ్‌సీ పరిధిలో 0-5 సంవత్సరాలు గల 1280 మంది పిల్లలకు చుక్కల మందును వేసేందుకు తొమ్మిది బూత్‌లను ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ సందర్భంగా సిబ్బందితో కలసి సెంటరులో అవగాహన ర్యాలీని నిర్వహించారు. ఎదురుమొండి, సొర్ల గొంది పీహెచ్ సీలో కూడా పల్స్ పోలియో అవగాహన ర్యాలీలు తీశారు.
