ఎమ్మెల్యే కొలికపూడిని కలిసిన నూతన ఏసీపీ..
శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసు శాఖకు సంపూర్ణ సహకారం : ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు
నూతన ఏసీపీ రామచంద్రరావుకు ఘన సత్కారం
తిరువూరు, ఆగస్టు 6(ఆంధ్రప్రభ రూరల్): మైలవరం ఏసీపీగా నూతన బాధ్యతలు స్వీకరించిన పెరవల్లి రామచంద్రరావు గురువారం తిరువూరు నియోజకవర్గ శాసనసభ్యులు కొలికపూడి శ్రీనివాసరావును మర్యాదపూర్వకంగా కలిశారు. స్థానిక ఎమ్మెల్యే కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో నూతన ఏసీపీకి ఎమ్మెల్యే కొలికపూడి శాలువా కప్పి ఘనంగా సత్కరించి, హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా నియోజకవర్గ పరిధిలోని పలు కీలక అంశాలపై ఇరువురు చర్చించారు. ప్రధానంగా తిరువూరు నియోజకవర్గంలో శాంతిభద్రతల పరిస్థితులు, ప్రజల భద్రత, నేరాల నియంత్రణ, ట్రాఫిక్ నిర్వహణ, అలాగే పోలీసు-ప్రజల మధ్య ఉండాల్సిన సమన్వయం తదితర అంశాలపై కాసేపు మాట్లాడుకున్నారు.

అనంతరం ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ప్రజలకు మెరుగైన, సమర్థవంతమైన పోలీసు సేవలు అందించేందుకు నిరంతరం కృషి చేస్తామని స్పష్టం చేశారు. నియోజకవర్గంలో శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసు శాఖతో సంపూర్ణ సమన్వయంతో పనిచేస్తామని, తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని ఆయన పేర్కొన్నారు. అత్యంత ఆత్మీయ వాతావరణంలో జరిగిన ఈ మర్యాదపూర్వక సమావేశంలో ఎమ్మెల్యే కార్యాలయ సిబ్బంది, పలువురు తిరువూరు పట్టణ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
