Ambati Rambabu | సీబీఐ విచారణకు డిమాండ్…

Ambati Rambabu | సీబీఐ విచారణకు డిమాండ్…

లోకేష్ రాజీనామా చేయాలి…

Ambati Rambabu | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్‌ : రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పై మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్ర ఆరోపణలు చేశారు. స్పోర్ట్స్ సర్టిఫికెట్ల వ్యవహారం, మెగా డీఎస్సీ నిర్వహణపై పలు ప్రశ్నలు లేవనెత్తుతూ ప్రభుత్వ తీరును విమర్శించారు.

స్పోర్ట్స్ సర్టిఫికెట్లను డబ్బులకు అమ్ముకున్నారని అంబటి రాంబాబు ఆరోపించారు. అలాగే మెగా డీఎస్సీ పేరుతో నిరుద్యోగులను మోసం చేశారని విమర్శించారు. ఈ వ్యవహారంపై మంత్రి లోకేష్ వెంటనే స్పందించాలని అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. లోకేష్‌కు చిత్తశుద్ధి ఉంటే మంత్రి పదవికి రాజీనామా చేయాలని కోరారు. అలాగే ఈ అంశంపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)తో విచారణ జరిపించి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఆరోపణలపై ప్రభుత్వం, సంబంధిత అధికారులు స్పందించాల్సి ఉందని పేర్కొన్నారు.

Leave a Reply