బాలుడిని పరమార్శించిన మున్సిపల్ వైస్ చైర్మన్

  • రూ.5 వేల ఆర్ధిక సహాయం

మోత్కూర్, ఆంద్రప్రభ : మోత్కూరు మున్సిపల్ పరిధిలోని కొండగడపలో ఇటీవల కోతుల దాడిలో గాయపడిన బాలుడు తొంట యశ్వంత్ ను బుధవారం మున్సిపల్ వైస్ చైర్మన్ పల్లెర్ల వెంకన్న పరామర్శించారు. అనంతరం రూ. 5000 ఆర్ధిక సాయంగా అందజేశారు. కోతుల బెడదకు తక్షణమే శాశ్వత పరిష్కారం చూపుతామని వైస్ చైర్మన్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ కొండ శోభ సోoమల్లు, కౌన్సిలర్ కారుపోతుల వెంకన్న గౌడ్ మున్సిపల్ కమిషనర్ జి నర్సయ్య, మాజీ సర్పంచ్ లింగం యాదవ్, నాయకులు దండేబోయిన వెంకన్న, సుదగాని యాదగిరి, సుదగాని రాములు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.