బహుజనులకు కాంట్రాక్టులు అప్పగించాలి
బహుజనులకు కాంట్రాక్టులు అప్పగించాలి
తొర్రూరు, ఆంధ్రప్రభ: బహుజన కాంట్రాక్టర్లకు ప్రభుత్వ టెండర్ పనులు అప్పగించాలని మాజీ జెడ్పిటిసి మంగళపల్లి శ్రీనివాస్, కాంట్రాక్టర్ల అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు భాష పంగు మహేందర్ లు డిమాండ్ చేశారు. సోమవారం డివిజన్ కేంద్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ కాంట్రాక్టు అసోసియేషన్ ఆధ్వర్యంలో సీఎం దిష్టిబొమ్మ దగ్ధం చేశారు.
ఈ సందర్భంగా వారు సంయుక్తంగా మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 17ను విద్యాశాఖ రంగంలో తీసుకువచ్చి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కాంట్రాక్టర్లకు ప్రభుత్వ రంగంలో ఉన్న అన్ని విద్యా సంస్థలలో అవకాశం లేకుండా చేస్తూ అనేక ఇబ్బందులు గురిచేస్తుందని, ఎస్సీ,ఎస్టీ బీసీ మైనార్టీలకు చెందవలసిన వాటను వాళ్లకు కేటాయించకుండా గుజరాత్ రాష్ట్రంలోని మఫ్ఫత్ లాల్ కంపెనీకి లోపాయికారంగా టెండర్లను అంట పెడుతూ మా జీవితాలతో చెలగాటమాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించి జీవో నంబర్ 17 ను వెంటనే రద్దు పరిచి ఎస్సీ,ఎస్టీ,బీసీ, మైనార్టీలకు టెండర్లలో అవకాశం కల్పించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనార్టీ అసోసియేషన్ జిల్లా నాయకులు వేర్పుల ఐలయ్య, సభ్యులు గుండే రామ్ నర్సయ్య,వేల్పుగొండ రాంబాబు, బీఆర్ఎస్ నాయకులు ఈదురు ఐలయ్య,బిందు శ్రీనివాస్, కుర్ర శ్రీనివాస్, కౌన్సిలర్లు తూర్పాటి రవి,పేర్ల జంపన్న తదితరులు పాల్గొన్నారు.
