Motorola | బ‌డ్జెట్ రేంజ్ లో మోటోరోలా నుంచి కొత్త మోడ‌ల్ !

లెనోవోకు చెందిన స్మార్ట్ ఫోన్ కంపెనీ మోటోరోలా నుంచి కొత్త మోడల్ ‘మోటోరోలా ఎడ్జ్ 60 ప్రో’ భారత మార్కెట్లో లాంఛ్ అయింది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత హలో యూఐ ఆపరేటింగ్ సిస్టమ్‌తో వస్తున్న ఈ ఫోన్ రూ.29,999 ప్రారంభ ధరతో లభిస్తుంది. ఫ్లిప్‌కార్ట్, మోటోరోలా ఇండియా వెబ్‌సైట్‌లో ప్రీ-ఆర్డర్‌లు ప్రారంభమయ్యాయి.

పూర్తి వివ‌రాలు ఇలా..

మీడియాటెక్ డైమెన్సిటీ 8350 ఎక్స్‌ట్రీమ్ ప్రాసెసర్‌తో లాంచ్ అయిన ఈ ఫోన్‌లో 12GB RAM, 256GB ఇన్‌బిల్ట్ స్టోరేజ్ ఉన్నాయి. వైర్‌ లెస్, రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది.

6.7 అంగుళాల 1.5K (1220×2712 పిక్సెల్స్) క్వాడ్ కర్వ్డ్ pOLED డిస్ ప్లే విత్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్. 446ppi పిక్సెల్ డెన్సిటీ. 4,500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్. ఫోన్ బరువు 186 గ్రాములు. 6,000mAh బ్యాటరీ. 90W టర్బోపవర్ ఫాస్ట్ ఛార్జింగ్. 15W వైర్‌లెస్ ఛార్జింగ్. 5W రివర్స్ ఛార్జింగ్.

వెనుకవైపు ట్రిపుల్ కెమెరా సెటప్. 50 మెగాపిక్సెల్ సోనీ LYTIA 700C సెన్సార్ మెయిన్ కెమెరా కాగా, 50 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ సెన్సార్, 10 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా ఉన్నాయి. ఫ్రంట్ కెమెరా 50 మెగాపిక్సెల్ గా ఉంది.

5G, 4G ఎల్టీఈ, వైఫై 6E, బ్లూటూత్ 5.4, జీపీఎస్, గ్లోనాస్, గెలీలియో, USB టైప్-C పోర్ట్ కనెక్టివిటీలు ఉన్నాయి. సెక్యూరిటీ కోసం ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్‌లాక్ వంటి ఫీచర్లున్నాయి. IP68 + IP69 రేటింగ్స్ తో డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ సపోర్ట్ ఉంటుంది. డాల్బీ అట్మాస్ సపోర్ట్‌తో డ్యూయల్ స్టీరియో స్పీకర్స్.

మోటోరోలా ఎడ్జ్ 60 ప్రో ధరలు

8GB ర్యామ్, 256GB స్టోరేజ్ బేస్ మోడల్ ధర రూ.29,999గా ఉంది.
12 GB ర్యామ్, 256 GB స్టోరేజ్ ధర రూ. 33,999 గా ఉంది.

మోటోరోలా ఎడ్జ్ 60 ఫోన్ పాంటోన్ డాజ్లింగ్ బ్లూ, పాంటోన్ స్పార్క్లింగ్ గ్రేప్, పాంటోన్ షాడో కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఫ్లిప్‌కార్ట్, మోటరోలా ఇండియా వెబ్‌సైట్ ద్వారా ప్రీ-ఆర్డర్‌లు ప్రారంభమయ్యాయి. మే 7న మధ్యాహ్నం 12 గంటలకు అమ్మకాలు ప్రారంభమవుతాయని కంపెనీ తెలిపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *