సుడిగాలి భీభత్సం..

సుడిగాలి భీభత్సం..
ఆళ్లపల్లి/ గుండాల, ఆంధ్రప్రభ : గుండాల మండల పరిధి రోళ్లగడ్డ పంచాయతీ దేవుళ్ళగూడెం గ్రామానికి చెందిన ఈసం ఎర్రయ్య అనే గిరిజన రైతు ఇంటి పై కప్పు రేకులు నేలకొరవడంతో, దయనీయ పరిస్థితి ఎదికోవాల్సిన దుస్థితి నెలకొందని రోల్లగడ్డ సర్పంచి భూక్య మంగమ్మ శ్రీను ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సోమవారం గాలి దుమారానికి ఎర్రయ్య ఇంటి పైకప్పు రేకులన్నీ శిధిలావస్థమై పగిలిపోవడం, నేలకు రాలడంతో, దిక్కుతోచని స్థితిలో వృద్ధ దంపతులు కొట్టుమిట్టాడుతూ ఆర్థిక సాయం కోసం, భరోసా కోసం ఎదురుచూస్తున్నారు. ఈ తరుణంలో రోళ్లగడ్డ సర్పంచ్ భూక్య మంగమ్మ,, టీఆర్ఎస్ పార్టీ మండల నాయకులు భూక్య శ్రీనివాస్ పరామర్శించి ఎర్రయ్య కుటుంబ సభ్యులను ఓదార్చి భరోసా కల్పించారు.
అనంతరం సర్పంచి మంగమ్మ శ్రీను మాట్లాడుతూ.. దేవుళ్ళగూడెం గ్రామంలోని అనేక మంది గిరిజనుల ఇండ్ల పైకప్పు రేకులు సుడిగాలితో, జెడివానతో శిథిలావస్థకు గురయ్యాయని వాపోయారు. అతివృష్టి, అనావృష్టితో ఒక్కసారిగా సుడిగాలి ప్రతాపం చూపడంతో, పైకప్పు రేకులన్నీ నేలమట్టమైయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. గాలిదుమారంతో ఈసం ఎర్రయ్య ఇంటి పైకప్పు రేకులను సుమారుగా మీటర్ దూరంలో పడిపోయి, ముక్కచెక్కలైన ఘటనతో వృద్ధదంపతులు కన్నీరు మున్నీరుగా విలపించారు.
ఇలాంటి ఘటనల పట్ల అధికార పార్టీ ఆధ్వర్యంలో కొంత ఆర్థిక సహాయం అందించాలని, స్థానిక నాయకులు సైతం గ్రామాల్లో పర్యవేక్షణ కరువైందని, స్థానిక నాయకులు కేవలం ఓట్లకే పరిమితం అయ్యారని అసహనం వ్యక్తం చేశారు. ఏదేమైనా ఈసం ఎర్రయ్య అనే గిరిజన వ్యక్తి ఇంటి పై కప్పు రేకులు నేలపాలు రావడంతో తనకు కొంత భరోసా, మనో ధైర్యాన్ని కల్పించి, వారికి అండగా నిలిచి మేమున్నాం అంటూ రోల్లగడ్డ సర్పంచి భూక్య మంగమ్మ శ్రీను నిలవడం విశేషం.
