hardik pandya| మ్యాచ్ ఫీజులో 10 శాతం జరిమానా

hardik pandya| మ్యాచ్ ఫీజులో 10 శాతం జరిమానా

ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : ఐపీఎల్ 2026లో హార్దిక్ పాండ్యాకు ఏదీ క‌లిసి రావ‌డం లేదు. ముంబైకి బ‌ల‌మైన జ‌ట్టు ఉన్నావిజ‌యాలు సాధించ‌డంలో వెనుక‌బ‌డింది. ఇప్ప‌టికే ఈ సీజ‌న్‌లో ప్లేఆఫ్స్ చేరే అవ‌కాశాల‌ను కోల్పోయింది. నిన్న జ‌రిగిన కేకేఆర్ తో జ‌రిగి మ్యాచులో కూడా ఘోర ఓటమి ఎదుర్కొంది. తర్వాత ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు మరో షాక్ తగిలింది. ఈ పరాజయం ముంబై ఇండియన్స్ జట్టుకో ఓ చేదు జ్ఞాపకంగా మిగిలిపోగా.. కెప్టెన్ హార్ధిక్ పాండ్యాకు బీసీసీఐ గట్టి షాక్ ఇచ్చింది. మ్యాచ్ జరుగుతున్న సమయంలో మైదానంలో నిరాశతో ప్రవర్తించిన తీరు, అంపైర్ నిర్ణయాలపై అసంతృప్తి వ్యక్తం చేయడం వల్ల హార్దిక్ పాండ్యాపై బీసీసీఐ క్రమశిక్షణా చర్యలు తీసుకుంది. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు గాను హార్దిక్ మ్యాచ్ ఫీజులో 10 శాతం జరిమానా విధించింది.

Leave a Reply