కేక్ కట్ చేసి, పండ్లు పంపిణీ చేసిన కాంగ్రెస్ నాయకులు
టేకుమట్ల, ఆంధ్రప్రభ : భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు(Gandra Satyanarayana Rao) జన్మదిన వేడుకలను టేకుమట్ల మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కోటగిరి సతీష్ గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు భారీ కేక్ కట్ చేసి మండల కేంద్రంలో వచ్చిన ప్రజలకు పండ్లు, స్వీట్లు(fruits, sweets) పంపిణీ చేశారు.
అనంతరం సతీష్ గౌడ్ మాట్లాడుతూ.. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ప్రజల మనిషి అని, నాడు ఏ పదవి లేకుండా 20 సంవత్సరాలు ప్రజల మధ్య ఉంటూ ప్రభుత్వ పథకాలను అమలు చేయించడంలో ప్రజల పక్షాన పోరాడాడని, ప్రజల మన్ననలు పొందిన జీఎస్ ఆర్(GSR) అత్యధిక మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలుపొంది ముఖ్యమంత్రికి నియోజకవర్గ సమస్యలను విన్నవిస్తూ, కోట్ల నిధులను(crores of funds) నియోజకవర్గానికి తీసుకోవచ్చి అభివృద్ధి చేసేందుకు నిరంతరం కృషి చేస్తున్నాడన్నారు.
రాబోయే రోజుల్లో భూపాలపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధిలో అగ్రగామిగా(leading) నిలపడమే లక్ష్యంగా పనిచేస్తున్న ఎమ్మెల్యే సత్యనారాయణ రావు మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని మనసారా ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, జిల్లా నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు, గ్రామ, శాఖ అధ్యక్షులు, ఎమ్మెల్యే అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

