ప్రజలందరిపై వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలి: ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్

పెడన, జూలై 5 (ఆంధ్రప్రభ): కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ ఆకాంక్షించారు. ఆదివారం ద్వారకాతిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానాన్ని కుటుంబ సమేతంగా సందర్శించిన ఆయన స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని, రైతులు, యువత, మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని స్వామివారిని ప్రార్థించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. అనంతరం ఆలయ వేద పండితులు దేవస్థాన సంప్రదాయం ప్రకారం ఎమ్మెల్యేకు వేద ఆశీర్వచనాలు అందించి, స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి ఘనంగా సత్కరించారు.