అత్యంత వేగంగా అమరావతి నిర్మాణం
- అమరావతి అభివృద్ధికి మరో ముందడుగు..
- సీడ్ యాక్సిస్ ఈ-3 రహదారి ప్రారంభం
- తిరువూరు ఎమ్మెల్యే కొలకపూడి శ్రీనివాసరావు
- సీఎం బాబుతో ఆత్మీయంగా కలిసిన తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు
తిరువూరు, ఆంధ్రప్రభ : ఆంధ్రుల కలల రాజధాని అమరావతి శరవేగంగా అభివృద్ధి చెందుతుందని తిరువూరు శాసనసభ్యుడు కొలకపూడి శ్రీనివాసరావు పేర్కొన్నారు. రాజధాని అమరావతి అభివృద్ధిలో మరో కీలక ముందడుగు పడింది. సీడ్ యాక్సిస్ ఈ-3 రహదారిని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గురువారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తిరువూరు శాసనసభ్యుడు కొలికపూడి శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావును ఆప్యాయంగా పలకరించారు.
అమరావతి అభివృద్ధిలో సీడ్ యాక్సిస్ ఈ-3 రహదారి ప్రారంభం మరో ముఖ్యమైన ఘట్టమని ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో రాజధాని నిర్మాణం, మౌలిక వసతుల అభివృద్ధి వేగవంతమవుతున్నాయని తెలిపారు. అమరావతి భవిష్యత్తులో రాష్ట్ర ప్రగతికి ప్రధాన కేంద్రంగా రూపుదిద్దుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అభివృద్ధి, సంక్షేమాన్ని సమన్వయం చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రాన్ని ప్రగతి పథంలో ముందుకు తీసుకెళ్తున్నారని కొలికపూడి శ్రీనివాసరావు అన్నారు. రాజధాని అమరావతి అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రితో కలిసి పాల్గొనడం సంతోషంగా ఉందని తెలిపారు.
