మల్లికార్జున ఆలయంలో ఎమ్మెల్యే పూజలు..
ఇచ్చోడ, ఆంధ్రప్రభ : శ్రావణ మాసం ప్రారంభం సందర్భంగా ఇచ్చోడ మండలంలోని ప్రసిద్ధ సీరిచేల్మా మల్లికార్జున ఆలయాన్ని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఎమ్మెల్యేకు పూర్ణకుంభంతో స్వాగతం పలికి, ప్రత్యేక పూజలు, అభిషేక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ స్వామివారి ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.
శ్రావణ మాసం సందర్భంగా ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులు, ఆలయ నిర్వాహకులకు ఎమ్మెల్యే సూచించారు. భక్తులకు తాగునీరు, పారిశుద్ధ్యం, ఇతర మౌలిక సదుపాయాల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, ఆలయ నిర్వాహకులు, భక్తులు పాల్గొన్నారు.
