MLA | ఎత్తిపోతల పథకం నిలిచిపోవడానికి కారణం….

MLA | ఎత్తిపోతల పథకం నిలిచిపోవడానికి కారణం….

MLA | తుగ్గలి, ఆంధ్రప్రభ : రాయలసీమ ఎత్తిపోతల పథకం నిలిచిపోవడానికి ప్రధాన కారణం వైయస్ జగన్మోహన్ రెడ్డి అని ఎమ్మెల్యే కే ఈ శ్యాం కుమార్ ఆరోపించారు. మంగళవారం రాతన గ్రామంలో హంద్రీనీవా కాలువ ద్వారా 108 చెరువులు నింపే ప్రాజెక్టులో భాగంగా రాతన చెరువును కృష్ణా జలాలతో నింపిన సందర్భంగా ఎమ్మెల్యే కే ఈ శ్యామ్ కుమార్, జిల్లా గ్రంధాల చైర్మన్ తుగ్గలి నాగేంద్ర, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ బత్తిన వెంకట్రాముడు, టిడిపి రైతు విభాగపు రాష్ట్ర ఉపాధ్యక్షులు మనోహర్ చౌదరి లు చెరువులు పరిశీలించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కే ఈ శ్యామ్ కుమార్ మాట్లాడుతూ రాయలసీమ ఎత్తిపోతల పథకం నిలిచిపోవడానికి ప్రధాన కారణం వైఎస్ జగన్మోహన్ రెడ్డేనని అన్నారు. ఇది ముమ్మాటికీ రాయలసీమకు జగన్ చేసిన ద్రోహమేనన్నారు. జగన్ రెడ్డి చేసిన తప్పు చేసి కప్పిపెట్టి, తమ ప్రభుత్వంపై బురద జల్లడం సరికాదన్నారు. 40 ఏళ్లలో వైఎస్ కుటుంబం చేయలేని పనిని సీఎం చంద్రబాబు చేసి చూపించారని కొనియాడారు. రాయలసీమను హార్టీకల్చర్ హబ్ గా సీఎం చంద్రబాబు తీర్చిదిద్దారని అన్నారు .హంద్రనీవా ద్వారా కర్నూల్ నుండీ కుప్పం వరకూ సాగు నీరందించామని వెల్లడించారు.

రాష్ట్రంలో ప్రతి ఎకరాకు నీరందించేలా సీఎం చంద్రబాబు రేయింబవళ్లు కృషి చేస్తున్నారన్నారు. రాయలసీమకు తాగు, సాగునీరు కల్పించిన ఘనత ముఖ్యమత్రి చంద్రబాబుదేని స్పష్టంచేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు తిరుపాలు నాయుడు, ఈరన్న స్వామి, ఆవుల మైరాముడు మహిళ టిడిపి అధ్యక్షురాలు రాతన ఈరమ్మ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply