ENT Doctors | 500కు పైగా వైద్య నిపుణులతో ప్రపంచ స్థాయి సదస్సు

ENT Doctors | 500కు పైగా వైద్య నిపుణులతో ప్రపంచ స్థాయి సదస్సు

అత్యాధునిక ఎండోస్కోపిక్ శస్త్రచికిత్సా పద్ధతులపై విశేష చర్చలు

యశోద హాస్పిటల్స్-సికింద్రాబాద్ లో మెదడులోని కణతులకు, అత్యాధునిక “ఎండోస్కోపిక్” శస్త్రచికిత్సా విధానాలపై నిర్వహించిన అంతర్జాతీయ వైద్యవిజ్ఞాన సదస్సు “ఇంటర్నేషనల్ ‘స్కల్ బేస్’ ఎండోస్కోపీ సమ్మిట్ 2.0”, 500+ వైద్య నిపుణులతో విజయవంతం. బ్రెయిన్ ట్యూమర్స్”ను విజయవంతంగా తొలగించడానికి అత్యాధునిక మినిమల్లీ ఇన్వేసివ్ న్యూరో-ఎండోస్కోపీ సర్జరీ విధానాలు, “స్కల్ బేస్” కేడావెరిక్ హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్, లైవ్ బ్రెయిన్ సర్జరీలతో ముగిసిన 3 రోజుల యశోద అంతర్జాతీయ న్యూరో సర్జరీ కాన్ఫరెన్స్ & లైవ్ వర్క్ షాప్

ENT Doctors | హైదరాబాద్, ఆంధ్ర‌ప్ర‌భ : యశోద హాస్పిటల్స్-సికింద్రాబాద్, సెంటర్ ఫర్ న్యూరోఎండోస్కోపీ (YCNE) ఆధ్వర్యంలో “ఇంటర్నేషనల్ స్కల్ బేస్ ఎండోస్కోపీ సమ్మిట్ 2.0” (ఏప్రిల్ 24 నుండి 26) మూడు రోజుల అంతర్జాతీయ సదస్సు విజయవంతంగా నిర్వహించబడింది. మినిమల్లీ ఇన్వేసివ్ న్యూరోసర్జరీ మరియు స్కల్ బేస్ శస్త్రచికిత్స రంగాల్లో యశోద హాస్పిటల్స్ మొదటి ఎడిషన్ విజయాన్ని కొనసాగిస్తూ, సమ్మిట్ 2.0ను ప్రపంచ స్థాయి అకడమిక్ వేదికగా 500 మందికి పైగా ప్రముఖ జాతీయ, అంతర్జాతీయ వైద్య నిపుణులతో ఘనంగా నిర్వహించారు.

ENT Doctors

స్కల్ బేస్ ఎండోస్కోపీ వైద్య రంగంలో నూతన ఆవిష్కరణలు, అనుభవం, నైపుణ్యం ఒకే వేదికపై కలిసేలా ఈ సదస్సు రూపొందించబడింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ న్యూరోసర్జన్స్, స్కల్ బేస్ శస్త్ర చికిత్స నిపుణులు, ENT వైద్యులు, అకడమిషియన్లు మరియు పోస్ట్‌గ్రాడ్యుయేట్ వైద్య విద్యార్థులు పాల్గొని, మైక్రోన్యూరోసర్జరీ మరియు న్యూరోఎండోస్కోపీ రంగాల్లో తమ అనుభవాలను పంచుకున్నారు. ఈ మూడు రోజుల సదస్సు & లైవ్ వర్క్ షాప్ లో భాగంగా చివరి మూడవ రోజు ముఖ్య అతిధిగా, యశోద హాస్పిటల్స్ డైరెక్టర్, డాక్టర్. పవన్ గోరుకంటి, సదస్సును ప్రారంభించారు.

ENT Doctors

ఈ సందర్భంగా యశోద హాస్పిటల్స్ డైరెక్టర్, డాక్టర్. పవన్ గోరుకంటి, మాట్లాడుతూ, “మా దృష్టి కేవలం వైద్య సేవలకే పరిమితం కాదు. వైద్య విద్య మరియు నూతన ఆవిష్కరణల ద్వారా భవిష్యత్తును తీర్చిదిద్దడం మా లక్ష్యం అన్నారు. యశోద సెంటర్ ఫర్ న్యూరోఎండోస్కోపీ (YCNE) న్యూరోఎండోస్కోపీ రంగంలో క్లినికల్ ఎక్సలెన్స్, శిక్షణ మరియు పరిశోధనలో కీలక పాత్రను కొనసాగిస్తుందని అన్నారు. ఈ శాస్త్రీయ సదస్సులో ప్రభావవంతమైన లెక్చర్లు, నిపుణుల ప్యానెల్ చర్చలు, కేస్-బేస్డ్ లెర్నింగ్ సెషన్లు మరియు లైవ్ సర్జరీ డెమోన్స్ట్రేషన్స్‌తో సమగ్రంగా నిర్వహించబడింది. ముఖ్యంగా హ్యాండ్స్-ఆన్ క్యాడవరిక్ ట్రైనింగ్ ఈ సదస్సులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది అన్నారు. ఈ సదస్సులో పాల్గొన్న వైద్యులు అంతర్జాతీయ వైద్య నిపుణుల పర్యవేక్షణలో అత్యాధునిక ఎండోస్కోపిక్ స్కల్ బేస్ టెక్నిక్స్‌ను ప్రాక్టికల్‌గా నేర్చుకునే అవకాశం పొందారని తెలిపారు. ఈ సమ్మిట్ ద్వారా ప్రపంచ న్యూరోసర్జరీ రంగానికి తన వంతు సహకారం అందించినట్లు డాక్టర్. పవన్ గోరుకంటి తెలిపారు.

ENT Doctors

యశోద హాస్పిటల్స్-సికింద్రాబాద్, సీనియర్ న్యూరోసర్జన్ డాక్టర్. అయ్యాదురై, మాట్లాడుతూ, “స్కల్ బేస్ సర్జరీకి అత్యంత ఖచ్చితత్వం, నైపుణ్యం, నిరంతర అభ్యాసం అవసరం. ఈ సమ్మిట్‌లో ఎండోస్కోపిక్ ఎండోనాసల్ స్కల్ బేస్ సర్జరీ, క్లిష్టమైన లెషన్స్‌కు ట్రాన్స్‌క్రానియల్ విధానాలు, పిట్యూటరీ ట్యూమర్లు మరియు సెల్లార్ ప్రాంత సమస్యల నిర్వహణ వంటి అంశాలపై విస్తృత చర్చ జరిగింది. అలాగే అంటీరియర్, మిడిల్ మరియు పోస్టీరియర్ స్కల్ బేస్ లెషన్స్, CSF లీక్ రిపేర్ టెక్నిక్స్, రీకన్స్ట్రక్షన్ విధానాలు, మినిమల్లీ ఇన్వేసివ్ న్యూరోసర్జరీ మరియు రోబోటిక్ సర్జరీలో నూతన అభివృద్ధులుపై నిపుణులు సవివరంగా వివరించారు. అదనంగా న్యూరో నావిగేషన్, ఇన్‌ట్రా ఆపరేటివ్ ఇమేజింగ్, టెక్నాలజీ ఆధారిత ఖచ్చితమైన శస్త్రచికిత్స విధానాలు, కాంప్లికేషన్స్ నివారణ మరియు నిర్వహణపై కేస్-బేస్డ్ చర్చలు నిర్వహించబడ్డాయి. ఏప్రిల్ 24 నుంచి 26 వరకు జరిగిన ఈ సమ్మిట్ ద్వారా అంతర్జాతీయ వైద్య నిపుణులతో ప్రత్యక్షంగా కలిసే అవకాశం, హ్యాండ్స్-ఆన్ శిక్షణ లభించడం వల్ల శస్త్రచికిత్స నిపుణులు ఆధునిక ఎండోస్కోపిక్ పద్ధతులను తమ ప్రాక్టీస్లో సులభంగా అమలు చేయగలుగుతారు” అని డాక్టర్. అయ్యాదురై అన్నారు.

ENT Doctors

ఈ మూడు రోజుల ఎండోస్కోపీ స్కల్ బేస్ కాడవర్ వర్క్‌షాప్‌కు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రముఖ వైద్యులు అమెరికాకు చెందిన డాక్టర్. థియోడర్ హెచ్ ష్వార్ట్జ్, హాంగ్ కాంగ్‌కు చెందిన డాక్టర్. కాల్విన్ మాక్ మరియు సికింద్రాబాద్‌లోని యశోద హాస్పిటల్స్ సీనియర్ న్యూరోసర్జన్ అయిన డాక్టర్. అయ్యదురై కోర్సు డైరెక్టర్లుగా వ్యవహరించారు. ఈ సమ్మిట్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయి న్యూరోసర్జన్స్ మరియు ENT నిపుణులు ఫ్యాకల్టీగా పాల్గొన్నారు.

ఈ కార్యక్రమం యశోద హాస్పిటల్స్ డైరెక్టర్, డాక్టర్. పవన్ గోరుకంటి, పర్యవేక్షణలో, యశోద హాస్పిటల్స్–సికింద్రాబాద్ యూనిట్ హెడ్, డాక్టర్. విజయ్ కుమార్, ఆధ్వర్యంలో విజయవంతంగా నిర్వహించబడింది.

ENT Doctors
ENT Doctors
ENT Doctors
ENT Doctors

Leave a Reply