ప్రైవేట్ ట్రావెల్ బస్సుకు త్రుటీలో తప్పిన ప్రమాదం..

ప్రైవేట్ ట్రావెల్ బస్సుకు త్రుటీలో తప్పిన ప్రమాదం..
నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : జాతీయ రహదారిపై నంద్యాల జిల్లా, పాణ్యం మండలం, కొచ్చేరు సమీపంలో గురువారం తెల్లవారుజామున మార్నింగ్ స్టార్ కు చెందిన ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సు రోడ్డు ప్రమాదానికి గురైన సంఘటన చోటుచేసుకుంది. పాణ్యం పోలీసులు తెలిపిన వివరాల మేరకు తెల్లవారుజామున హైదరాబాద్ నుండి తిరుపతి కి 30 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సు పాణ్యం మండలం సుగాలి మెట్ట కొచ్చెరువు ప్రాంతంలో అదుపు తప్పి రోడ్డు ప్రక్కనున్న ఐరన్ గ్రిల్ ను, తగలడం జరిగింది. వెంటనే అప్రమత్తమయిన డ్రైవర్ రోడ్డు ప్రక్కన బస్సును నిలిపి వేశారు.

అందులో ఉన్న ప్రయాణికులంతా క్షేమం గా బయటపడ్డారు. ప్రవేట్ ట్రావెల్ బస్సు ముందు భాగం కొంత మేరకు డామేజ్ జరిగింది. పోలీస్ హైవే పెట్రోలింగ్ వాహనం హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకొని ప్రయాణికులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. వారిని సురక్షితంగా మరో బస్సులో తరలించారు. ప్రమాదం జరిగినప్పుడు డ్రైవర్ అప్రమత్తంగా వ్యహరించాల్సిన అవసరం ఉందని పోలీసులు తెలిపారు.
