Mahabubnagar | బస్సు సర్వీసును పునరుద్ధరించండి

Mahabubnagar | బస్సు సర్వీసును పునరుద్ధరించండి

  • పాలమూరు ఆర్టీసీ అధికారులకు
  • వినతి అందజేసిన ఉమ్మడి పంచాయితీ సర్పంచులు యువజన సంఘాలు.

Mahabubnagar | ఆంధ్రప్రభ, పాలమూరు : మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం నుండి ఆర్టీసీ సర్వీస్ నవాబుపేట వయా కొత్తపల్లి వరకు నిలిచిపోయిన బస్సు సర్వీసు పునరుద్ధరించి ఈ ప్రాంత ప్రయాణికులకు మేలు చేయాలంటూ ఇవాళ మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని కార్యాలయంలో ఆర్టీసీ అధికారులకు ఉమ్మడి పంచాయతీల సర్పంచులు యువజన సంఘాలు వినతి పత్రాన్ని అందజేశారు.

ఈసందర్భంగా మహబూబ్ నగర్ బస్ స్టేషన్ మేనేజర్ వహీద్ కు మరికల్, కన్మన్కల్వ కొత్తపల్లి, కిష్టంపల్లి, బంగరంపల్లి ,పురుసంపల్లి గ్రామాలకు చెందిన సర్పంచులు, ఉప సర్పంచ్లు యువజన సంఘాలు వినతి పత్రాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… దశాబ్దాల కాలంగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం నుండి నవాపేట మీదుగా కొత్తపల్లి వరకు ఆర్టీసీ సర్వీసు సేవలందించిందన్నారు. ఈ సర్వీస్ ద్వారా ఈ ప్రాంతానికి చెందిన ప్రయాణికులతో పాటుగా విద్యార్థులకు వ్యాపారస్తులకు ఎంతో మేలు జరిగిందని గుర్తు చేశారు. కరోనా తర్వాత కొత్తపల్లి బస్సు సర్వీసు రద్దు కావడంతో ఉమ్మడి పంచాయితీ గ్రామాలకు మహబూబ్ నగర్ చేరేందుకు రవాణా సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామన్నారు. ఉమ్మడి గ్రామపంచాయతీ ప్రయాణికులకు తిరిగి యధావిధిగా కొత్తపల్లి వయ నవపేట బస్సు సర్వీసును పునరుద్ధరించాలని అధికారులను కోరారు.

ఈ కార్యక్రమంలో సర్పంచులు ఇందిరా సత్య కుమార్, కేశవులు, రజిత నరసింహులు, కృష్ణవేణి రాజు, వెంకటేష్, మరికల్ పిఎసిఎస్ డైరెక్టర్ దివిటి అశోక్, ఉప సర్పంచ్లు ఎడ్ల శ్రీనివాసులు శ్రీకాంత్ రెడ్డి, పులగాళ్ల పాండు, జిల్లా బహుజన నాయకుడు నరేష్ ఉమ్మడి పంచాయితీ యువజన సంఘాల సమాఖ్య నాయకులు భాను ప్రకాష్, రఘు, భరత్ యశ్వంత్, మహబూబ్, నరసింహులు, వెంకట రాములు, రమేష్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply