ఆలేరు ప్రభుత్వ జూనియర్ కళాశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనం

ఆలేరు, ఆంధ్రప్రభ: యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 2001–2003 విద్యా సంవత్సరానికి చెందిన సీఈసీ, హెచ్‌ఈసీ గ్రూపుల పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఘనంగా నిర్వహించారు.

23 సంవత్సరాల క్రితం కళాశాలలో చదువుకున్న విద్యార్థులు సమ్మేళనానికి హాజరై ఆనాటి మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. తమ విద్యార్థి దశలోని అనుభవాలను పరస్పరం పంచుకుంటూ ఆనందం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా అప్పటి అధ్యాపకులు పద్మనాభం, రామ్‌చందర్, ఎట్టయ్యలను పూర్వ విద్యార్థులు శాలువాలతో సన్మానించి, వారి సేవలను కొనియాడారు.

కార్యక్రమంలో కూళ్ల సంపత్, కొత్తోజు లక్ష్మి, గవ్వల వీరస్వామి, తుంగ కుమార్, చిలుకు స్వామి, గడసంతల భాస్కర్, జూకంటి శంకర్, కోయలకారి శ్రీలత, సైనాస్ బేగం, భాగ్యలక్ష్మి, సమేశ్వర్, దడిగే సతీష్, ఎర్రరాజు, అక్కెనపల్లి రవి, దూడల వెంకటేష్, రవికుమార్, వీరేశం, బీరయ్య, వెంకటేష్, అమీర్, విజయ, బద్రినిస్ తదితరులు పాల్గొన్నారు.