AP | పోలీస్ శాఖలో కీలక మార్పులు
AP | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పలువురు ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. పరిపాలనా అవసరాల దృష్ట్యా ఈ మార్పులు చేపట్టినట్లు ప్రభుత్వం తెలిపింది.
ఉత్తర్వుల ప్రకారం.. నవజ్యోతి మిశ్రాను మార్కాపురం జిల్లా ఓఎస్డీ (అడ్మినిస్ట్రేషన్)గా, పాటిల్ దేవ్ రాజును రాజమహేంద్రవరం అదనపు ఎస్పీ (అడ్మినిస్ట్రేషన్)గా నియమించారు. మందా జావలి అల్ఫోన్స్కు పోలవరం జిల్లా ఓఎస్డీ (అడ్మినిస్ట్రేషన్)గా బాధ్యతలు అప్పగించారు.
అలాగే మనోజ్ రామనాథ్ హెగ్డేను అమరావతిలో ఓఎస్డీ (లా అండ్ ఆర్డర్)గా, రోహిత్ కుమార్ చౌదరిని పల్నాడు జిల్లా అదనపు ఎస్పీగా, సుస్మితను నంద్యాల అదనపు ఎస్పీగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
మరోవైపు ముఖ్యమంత్రి కార్యదర్శి కార్తికేయ మిశ్రా విదేశీ పర్యటనకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. వచ్చే నెల 17 నుంచి 27 వరకు ఆయన సింగపూర్లో పర్యటించనున్నారు. ఈ మేరకు సంబంధిత శాఖ అధికారిక అనుమతులు జారీ చేసింది.
