‘ మీకోసం’లో ఫోన్లపై జాయింట్ కలెక్టర్ ఆగ్రహం..
‘ మీకోసం’లో ఫోన్లపై జాయింట్ కలెక్టర్ ఆగ్రహం..
ప్రజా సమస్యల పరిష్కారానికి వచ్చినప్పుడు పూర్తి ఏకాగ్రతతో విధులు నిర్వర్తించాలి: అధికారులకు సూచన
మచిలీపట్నం , ఆంధ్రప్రభ : ప్రజా సమస్యల పరిష్కార వేదిక ‘మీకోసం’ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ నవీన్ కుమార్ కొంతమంది అధికారుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమం జరుగుతున్న సమయంలో కొంతమంది అధికారులు సెల్ఫోన్లలో మాట్లాడుతున్న విషయాన్ని ఆయన గమనించారు. దీంతో వెంటనే స్పందించిన జాయింట్ కలెక్టర్, ప్రజల సమస్యలు వినేందుకు నిర్వహించే కార్యక్రమంలో అధికారులు ఫోన్లలో మాట్లాడటం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల వినతులను శ్రద్ధగా ఆలకించి, వాటి పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఇలాంటి కార్యక్రమాల సమయంలో అధికారులు పూర్తి ఏకాగ్రతతో విధులు నిర్వర్తించాలని, అత్యవసర పరిస్థితులు మినహా సెల్ఫోన్ల వినియోగాన్ని నివారించాలని ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని, అధికారులు కూడా అదే బాధ్యతతో వ్యవహరించాలని జాయింట్ కలెక్టర్ స్పష్టం చేశారు.
