జైనూర్ విద్యుత్ శాఖ నూతన ఏఈగా లచ్చన్న

జైనూర్ విద్యుత్ శాఖ నూతన ఏఈగా లచ్చన్న

జైనూర్, ఆంధ్రప్రభ: మండలంలో విద్యుత్ సమస్యలు తలెత్తకుండా నిరంతరం శ్రమిస్తానని జైనూర్ మండల విద్యుత్ శాఖ నూతన అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ) ఎం. లచ్చన్న అన్నారు. శనివారం ఆయన నూతన ఏఈగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. జన్నారం మండలంలో పనిచేస్తూ బదిలీపై ఆయన ఇక్కడికి వచ్చినట్లు విద్యుత్ శాఖ ఉద్యోగి లక్ష్మణ్ తెలిపారు.

ఈ సందర్భంగా నూతన ఏఈ లచ్చన్న మాట్లాడుతూ… మండలంలో విద్యుత్ సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని, నిరంతర విద్యుత్ సరఫరాకు తగిన చర్యలు తీసుకుంటానని పేర్కొన్నారు. గ్రామాల్లో విద్యుత్ పరంగా ఎలాంటి సమస్యలు తలెత్తినా వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని ఆయన ప్రజలను కోరారు. గతంలో ఇక్కడ ఇన్‌చార్జ్ ఏఈగా కృష్ణ సాయి కొనసాగగా, ప్రస్తుతం రెగ్యులర్ ఏఈగా లచ్చన్న బాధ్యతలు స్వీకరించినట్లు విద్యుత్ ఉద్యోగులు తెలిపారు.

Leave a Reply