ఖాయంగా కనిపిస్తున్న కాంగ్రెస్ విజయం

ఖాయంగా కనిపిస్తున్న కాంగ్రెస్ విజయం

  • ప్రచారంలో వెనుకబడ్డ మిగతా పార్టీ అభ్యర్థులు

మంథని, ఆంధ్రప్రభ : మున్సిపల్ కౌన్సిలర్ ఎన్నికల్లో 4వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మద్దికట్ల స్రవంతి – రమేష్ బాబు ప్రచారంలో దూసుకుపోతున్నారు. నాలుగో వార్డ్ లో ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చి స్రవంతి – రమేష్ బాబులకు మద్దతు పలుకుతున్నారు. ఇల్లు ఇల్లు, వాడ వాడ, గల్లి గల్లి తిరుగుతూ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. స్రవంతి రమేష్ బాబులకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి ప్రచారంలో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా స్రవంతి- రమేష్ బాబు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి దశాబ్ద కాలంగా తాము చేస్తున్న సేవలను గుర్తించి మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, శ్రీనుబాబు తమకు కౌన్సిలర్ గా పోటీ చేసే అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.

మంత్రి శ్రీధర్ బాబు చేస్తున్న అభివృద్ధి పనులు సంక్షేమ పథకాలు తమను విజయతీరాలకు చేరుస్తాయని స్రవంతి- రమేష్ బాబు, ధీమా వ్యక్తం చేస్తున్నారు. తాము గెలిచిన తర్వాత వార్డులోని అన్ని సమస్యలను మంత్రి శ్రీధర్ బాబు సహాయ సహకారాలతో పరిష్కరిస్తామని తెలిపారు.4వ వార్డ్ కు సంబంధించి సొంత మేనిఫెస్టో తయారుచేసి ప్రజలకు వివరిస్తున్నారు. వార్డులో కోతుల బెడదను నివారించడం, నిరుపేదలకు పక్కా గృహాలు, పెన్షన్లు, ఉపాధి అవకాశాలు, గ్రామంలో అపరిష్కృతంగా ఉన్న డ్రైనేజీలు, సీసీ రోడ్ల నిర్మాణానికి కృషి, మహిళ సాధికారకత కు సూక్ష్మ రుణాలు ఇప్పించడం, గ్రామంలో పర్యావరణ పరిరక్షణకు ఖాళీ స్థలాల్లో చెట్టు నాటడం, వార్డులో లైబ్రరీ ఏర్పాటు చేయడం, ఇంటర్నెట్ సౌకర్యం కల్పించడం, నెలకు ఒకసారి బస్తి దావఖాన ఏర్పాటుచేసి రోగులకు పరీక్షలు చేయిస్తామని అన్నారు.

4వ వార్డు (ఎస్సీ మహిళ)కు రిజర్వు కాగా ఇక్కడ 505 పురుష ఓటర్లు, 558 మహిళా ఓటర్లు మొత్తం 1063 మంది ఓటర్లు ఉన్నారు. నాలుగో వార్డ్ లో లైన్ గడ్డ, గణేష్ నగర్, గంగాపురి ఎస్సీ కాలనీ, బీసీ కాలనీకి చెందిన ఓటర్లు ఉన్నారు.ఇక్కడ నామినేషన్ల అనంతరం ద్విముఖ పోటీ ఉంటుందని భావించినా గెలుపు ఏకపక్షంగా మారిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. వార్ వన్ సైడ్ లాగా మారి 13 వార్డులలో ఎక్కడలేని విధంగా మారిపోయింది. ఇక్కడి కాంగ్రెస్ అభ్యర్థి భారీ మెజార్టీతో గెలుపొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నాలుగవ వార్డు అభ్యర్థి మద్దికట్ల స్రవంతి- రమేష్ బాబు అలుపెరగకుండా నూతన ఉత్సాహంతో విజయం దిశగా ముందుకు సాగుతున్నారు. ఈనెల 11న పోలింగ్, 13వ తేదీన అభ్యర్థుల భవితవ్యం తేలనున్నది.

Leave a Reply