Telangana | రాష్ట్రస్థాయి కుస్తీకి మదర్ థెరిసా విద్యార్థులు

Telangana | రాష్ట్రస్థాయి కుస్తీకి మదర్ థెరిసా విద్యార్థులు
Telangana | దండేపల్లి, ఆంధ్రప్రభ : స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్ 17 రాష్ట్రస్థాయి (Under-17 State Level) రెజ్లింగ్ (కుస్తీ) పోటీలకు దండేపల్లి మండలంలోని కన్నెపల్లి మదర్ థెరిసా పాఠశాల ( Mother Teresa School) కు చెందిన విద్యార్థినీలు ఎం.సాత్విక పి.నైతిక ఎంపికయ్యారు. ఆ పాఠశాల ప్రిన్సిపాల్ అనూప్ జార్జ్, మేనేజర్ షైన్, కరస్పాండెంట్ లింటో పీఈటీలు సుద్దాల దీపిక, గారె పవన్ మాట్లాడుతూ… రెండ్రోజులు హైదరాబాద్ జిల్లాలో జరిగే రాష్ట్రస్థాయి కుస్తీ పోటీల్లో పాల్గొనున్నట్లు వారు తెలిపారు. ఎంపికైన విద్యార్థులను పాఠశాల ఉపాధ్యాయులు ప్రధానోపాధ్యాయులు, అభినందించారు.
