Leopard Hunting | వరుసగా రెండు చిరుతల కళేబరాలు..

Leopard Hunting | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : నిజామాబాద్ జిల్లాలో చిరుతపులులను లక్ష్యంగా చేసుకుని వేటాడుతున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చర్మం, గోర్ల కోసం చిరుతలను వేటాడుతున్నట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ఈ ఘటన జిల్లాలో కలకలం రేపుతోంది.

భీంగల్ మండలం తాళ్లపల్లి అటవీ ప్రాంతంలో ఓ చిరుత కళేబరాన్ని అటవీశాఖ అధికారులు గుర్తించారు. అలాగే ఇందల్‌వాయి రేంజ్ పరిధిలోని రామడుగులోలం అటవీ ప్రాంతంలోని ఓ బావిలో మరో చిరుత కళేబరం లభ్యమైంది. వరుసగా రెండు చిరుతల మృతదేహాలు బయటపడటంతో అటవీశాఖ, పోలీసులు అప్రమత్తమయ్యారు.

ఈ కేసులో ధర్పల్లి, భీంగల్ ప్రాంతాలకు చెందిన పలువురు అనుమానిత వేటగాళ్లను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. చిరుతలను ఎలా వేటాడారు, చర్మం, గోర్లను ఎవరికి విక్రయించాలనుకున్నారు, ఈ ముఠా వెనుక మరెవరైనా ఉన్నారా అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది. అటవీశాఖ అధికారులు ఘటనాస్థలాలను పరిశీలించి ఆధారాలు సేకరిస్తున్నారు. పూర్తి విచారణ అనంతరం మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.