నూతన చిత్రానికి పూజా కార్యక్రమం..
తొలి షాట్‌కు క్లాప్ కొట్టి చిత్రీకరణ ప్రారంభించిన ఖూడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు
కర్నూలు, ఆంధ్రప్రభ : కర్నూలు నగరంలోని ఎన్.ఆర్.పేటలో ఇందిర కృష్ణ క్రియేషన్స్ బ్యానర్‌పై రూపొందుతున్న నూతన తెలుగు చలన చిత్రానికి సోమవారం ఘనంగా పూజా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఖూడా (కర్నూలు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ) చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు తొలి షాట్‌కు క్లాప్ కొట్టి చిత్రీకరణను లాంఛనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలుగు సినీ పరిశ్రమ రోజురోజుకు అభివృద్ధి చెందుతూ కొత్త ప్రతిభకు వేదికగా నిలుస్తోందన్నారు. యువ దర్శకులు, నిర్మాతలు, నటీనటులను ప్రోత్సహించే ఇటువంటి చిత్రాలు మరిన్ని రావాలని ఆకాంక్షించారు. సృజనాత్మకతతో రూపొందుతున్న ఈ చిత్రం ప్రేక్షకుల ఆదరణ పొందడంతో పాటు వాణిజ్యపరంగానూ విజయవంతం కావాలని ఆకాంక్షించారు.
చిత్ర నిర్మాతలు, దర్శకుడు, నటీనటులు, సాంకేతిక నిపుణులకు అభినందనలు తెలియజేసిన సోమిశెట్టి వెంకటేశ్వర్లు, చిత్ర నిర్మాణం ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తై ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు.
పూజా కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులు, సినీ ప్రముఖులు, అభిమానులు, స్థానికులు పాల్గొని చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమం ఆత్మీయ వాతావరణంలో సాగగా, చిత్ర యూనిట్ సభ్యులు ముఖ్య అతిథికి కృతజ్ఞతలు తెలిపారు.

