krithi shetty| గ్లామర్ డోస్ పెంచేసిన బేబమ్మ..
krithi shetty| గ్లామర్ డోస్ పెంచేసిన బేబమ్మ..
ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : హీరోయిన్ కృతిశెట్టి ఉప్పెన సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది.. మొదటి సినిమాతోనే తన నటనతో యూత్‌ను ఆకట్టుకుంది. ఈ సినిమా బ్లాక్‌బస్టర్ విజయం ఆమెకు ఉత్తమ నటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డును తెచ్చిపెట్టింది. ఆ తర్వాత శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు చిత్రాలతో హిట్స్ అందుకుంది కృతి శెట్టి. ఆ తర్వాత వరుస అవకాశాలు అందుకుంది. కానీ వరుసగా ప్లాప్స్ రావడంతో ఈ బ్యూటీ క్రేజ్ తగ్గిపోయింది. ఇప్పుడు తమిళంలో వరుస ఆఫర్స్ అందుకుంటూ అక్కడే బిజీగా ఉంటుంది కృతి శెట్టి. సోషల్ మీడియాలో, ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్‌లో తన గ్లామరస్, ట్రెడిషనల్ ఫొటోషూట్లతో నిరంతరం వార్తల్లో నిలుస్తుంది.





























