రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

అవయవాల దానంతో నలుగురు జీవితాలలో వెలుగులు
విజయ్ కుమార్ మృతితో జగ్గయ్యపేటలో విషాద ఛాయలు

జగ్గయ్యపేట, ఆంధ్రప్రభ : జగ్గయ్యపేట పట్టణానికి చెందిన యువకుడు ఉప్పుతోళ్ల విజయ్ కుమార్ హైదరాబాదులో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఈనెల 20వ తారీఖున హైదరాబాద్ కుక్కట్ పల్లి ప్రాంతంలో బైక్ పై వెళుతున్న సందర్భంలో జరిగిన యాక్సిడెంట్లలో తలకు తీవ్రమైన గాయాలు కావడంతో విజయకుమార్ బ్రెయిన్ డెడ్ అయినట్లు అక్కడి వైద్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న విజయ్ కుమార్ తల్లిదండ్రులు గొప్ప మనసు చేసుకొని తమ కుమారుడి అవయవాలను దానం చేయడం ద్వారా నలుగురికి పునర్జన్మ లభించే అవకాశం ఉందని తెలుసుకొని వారికి తమ కుమారుడి అవయవాలు అందించేందుకు అంగీకరించారు.

గుండె, కిడ్నీలు, కాలయం వంటి అవయవాలను దానం చేశారు. ఈ అవయవ దానంతో అత్యవసర పరిస్థితుల్లో ఉన్న నలుగురికి ఉపయోగపడి వారిలో తమ బిడ్డ బతుకే ఉంటాడని తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. విజయ్ కుమార్ తల్లిదండ్రులు చూపిన మానవీయతను గొప్ప మనసును జగ్గయ్యపేట ప్రాంతవాసులు అభినందిస్తున్నారు. జగ్గయ్యపేట చెరువు బజార్ ప్రాంతానికి చెందిన విజయకుమార్ బ్రెయిన్ డెత్తో మృతి చెందటం తో ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Leave a Reply