ప్రజల దాహార్తిని తీర్చేందుకే చలివేంద్రాలు ఏర్పాటు

ప్రజల దాహార్తిని తీర్చేందుకే చలివేంద్రాలు ఏర్పాటు
- పట్టణ ప్రముఖులు రంగా వెంకటేశ్వర్లు
మధిర, ఆంధ్రప్రభ : పట్టణంలోని ఆర్వి కాంప్లెక్స్ వద్ద రంగా వెంకటేశ్వర్లు సుగుణవతి చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని గురువారం పట్టణ ప్రముఖులు చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు రంగా వెంకటేశ్వర్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వేసవి కాలంలో త్రాగునీటికి ఇబ్బందులు తలెత్తకుండా తమ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ప్రతి సంవత్సరం ఆర్వి కాంప్లెక్స్ వద్ద చలివేంద్రాలను ఏర్పాటు చేయటం జరుగుతుందన్నారు.
త్రాగు నీటిని వృధా చేయకుండా ప్రజల కోసం ఏర్పాటు చేసిన చలివేంద్రాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. వేసవికాలంలో జన సంచారం అధికంగా ఉండే ఆర్వి కాంప్లెక్స్ వద్ద చలివేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎలక్ట్రిషన్ అసోసియేషన్ అధ్యక్షులు నరేంద్ర కాంగ్రెస్ పార్టీ13వ వార్డు డివిజన్ ఇన్చార్జి రబ్బాని, 21 వ వార్డు కాంగ్రెస్ పార్టీ నాయకులు గాలి ప్రసాద్ ఆటో వర్కర్స్ యూనియన్ నాయకులు బాబు ఎమ్మెస్ బ్రదర్స్ అధినేత శ్రీనివాసరావు శివారెడ్డి, మహంకాళి సాయి, రంగా రాహుల్ తదితరులు పాల్గొన్నారు.
