2026 Assembly elc | అప్పుడు జయలలిత.. ఇప్పుడు..

2026 Assembly elc | అప్పుడు జయలలిత.. ఇప్పుడు..

2026 Assembly elc | విజయ్ సంచలన విజయం – రాజకీయాల్లో దళపతి దూకుడు
విజయ్ ఇంటికి త్రిష రాక – వైరల్ అవుతున్న క్షణాలు
ఎంజీఆర్-జయలలిత పోలికలు – నెటిజన్ల ఆసక్తికర చర్చ
108 స్థానాల్లో ఆధిక్యం – పాత పార్టీల్లో గుబులు
యువత, మహిళల మద్దతు – విజయానికి కీలక కారణం

2026 Assembly elc | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం షూరూ అయ్యింది. వెండితెరపై ‘దళపతి’గా వెలిగిన నటుడు విజయ్, ఇప్పుడు రాజకీయ క్షేత్రంలోనూ తన సత్తా ఏంటో చూపించారు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన స్థాపించిన తమిళగ వెట్రి కళగం అనూహ్య విజయాలను నమోదు చేస్తూ అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఈ చారిత్రాత్మక విజయం ఒక ఎత్తు అయితే, ఈ గెలుపు సంబరాల్లో సౌత్ క్వీన్ త్రిష మెరవడం ఇప్పుడు సోషల్‌ మీడియాను షేక్ చేస్తోంది.

విజయ్ ఇంటికి త్రిష..
మే 4వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న సమయంలోనే త్రిష పుట్టినరోజు కూడా కావడం విశేషం. ఉదయాన్నే తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న త్రిష, ఆ వెంటనే నేరుగా చెన్నైలోని విజయ్ నివాసానికి వెళ్లారు. పార్టీ విజయపథంలో దూసుకుపోతున్న తరుణంలో ఆమె విజయ్‌ను కలిసి శుభాకాంక్షలు తెలపడం ప్రాధాన్యత సంతరించుకుంది. దీనికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

జయలలితతో పోలిక.. నెటిజన్ల ఆసక్తికర చర్చ..
విజయ్ గెలుపు, త్రిష పలకరింపు చూస్తుంటే తమిళనాడు పాత రోజులను గుర్తుచేస్తోందని నెటిజన్లు సోషల్‌ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.
ఒకప్పుడు వెండితెరపై సూపర్ హిట్ జోడీగా ఉండి, ఆ తర్వాత రాజకీయాల్లోనూ చక్రం తిప్పిన ఎంజీఆర్, జయలలితలను విజయ్, త్రిషలతో పోలుస్తున్నారు. ‘గిల్లి’ నుంచి ‘లియో’ వరకు వీరిద్దరి కెమిస్ట్రీకి విపరీతమైన ఫ్యాన్ బేస్ ఉంది. ఇప్పుడు విజయ్ రాజకీయ ప్రస్థానంలో త్రిష అండగా ఉండటం చూస్తుంటే, ఆమె కూడా రాజకీయాల్లోకి వస్తారా? అనే చర్చ మొదలైంది.

పాత రికార్డులు కనుమరుగు..
దాదాపు 108 స్థానాల్లో ఆధిక్యం ప్రదర్శిస్తూ విజయ్ పార్టీ జైత్రయాత్ర కొనసాగిస్తుండటంతో అటు డీఎంకే, ఇటు ఏఐడీఎంకే వర్గాల్లో గుబులు మొదలైంది. యువత, మహిళా ఓటర్లు విజయ్ వైపు మొగ్గు చూపడం ఈ గెలుపులో కీలక పాత్ర పోషించిందని విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తానికి, విజయ్ పొలిటికల్ ఎంట్రీతో తమిళనాడు రాజకీయాల్లో కొత్త శకం మొదలైందని, త్రిష రాకతో దానికి మరింత గ్లామర్ తోడైందని అభిప్రాయపడుతున్నారు.

CLICK HERE TO READ 118Seats | రెండు వారాల్లో మెజారిటీ నిరూపిస్తా…

CLICK HERE TO READ MORE