శానిటేషన్‌పై దృష్టి సారించాలి…
శానిటేషన్‌పై దృష్టి సారించాలి…
స్వచ్ఛ ఆంధ్రా స్వర్ణ ఆంధ్ర ద్వారా అవగాహన..
సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు..
పాయకాపురం, ఆంధ్రప్రభ : శానిటేషన్పై వీఎంసీ సిబ్బంది దృష్టి సారించాలని స్వచ్ఛ ఆంధ్రా స్వర్ణ ఆంధ్ర ద్వారా అవగాహన కార్యక్రమంలో సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అన్నారు. స్థానిక 59వ డివిజన్ సింగ్ నగర్లోని ఎం.కే. బేగ్ స్కూల్ నందు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో స్వచ్ఛ ఆంధ్రా స్వర్ణ ఆంధ్ర అవగాహన సదస్సు కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు హాజరై విద్యార్థులతో స్వచ్ఛత ప్రతిజ్ఞ చేయించారు, అనంతరం ఇంకుడు గుంతల ప్రాముఖ్యతను వివరించి మొక్కలు నాటారు. రాష్ట్రవ్యాప్తంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ఉద్యమ స్ఫూర్తితో విస్తృత స్థాయిలో అమలు చేస్తున్నామని తెలిపారు. స్కూలు పిల్లల నుంచి మహిళల వరకు ప్రతి ఇంటికీ చేరే విధంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల్లో పరిశుభ్రతపై చైతన్యం పెంచుతున్నామని అన్నారు.
రాష్ట్రాన్ని చెత్త రహితంగా, నగరాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ఇందుకోసం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ నియోజకవర్గ కోఆర్డినేటర్ నవనీతం సాంబశివరావు, డివిజన్ అధ్యక్షుడు బంగారు నాయుడు, ప్రధాన కార్యదర్శి బుదాల సురేష్, బుదాల అబ్రాహాము,ఎస్. కె రహిమ్, వంశీ, మద్దాల మహేష్ గౌసియా, స్కూల్ ప్రధానోపాధ్యాయులు హుస్సేన్, ఇమామ్ బాషా తదితరులు పాల్గొన్నారు.
64వ డివిజన్లో.. స్థానిక64వ డివిజన్ బివి సుబ్బారెడ్డి హై స్కూల్ ఆవరణలో స్వచ్చంద్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ అధ్యక్షుడు కె. రవికుమార్ పాల్గొని స్వచ్ఛతపై ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని ఆయన వీఎంసీ, స్కూల్ సిబ్బంది, స్థానిక ప్రజలచే ప్రతిజ్ఞ చేయించారు.
