మక్తల్ 6వ వార్డులో పోలింగ్ పరిశీలించిన అదనపు కలెక్టర్

మక్తల్, ఆంధ్రప్రభ : నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపాలిటీ పరిధిలోని 6వ వార్డులో జరుగుతున్న ఎన్నికల పోలింగ్ సరళిని శనివారం జిల్లా అదనపు కలెక్టర్ ఫణిందర్ రెడ్డి పరిశీలించారు.

రాష్ట్రవ్యాప్తంగా ఫిబ్రవరి 11న మున్సిపల్ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. మక్తల్ మున్సిపాలిటీలో మొత్తం 16 వార్డుల్లో 15 వార్డులలో ఎన్నికలు పూర్తయ్యాయి. అయితే 6వ వార్డులో బీజేపీ అభ్యర్థి ఎరుకలి మహాదేవప్ప పోలింగ్‌కు ముందు రోజు ఆత్మహత్యకు పాల్పడటంతో ఎన్నిక వాయిదా పడింది. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈ రోజు తిరిగి పోలింగ్ నిర్వహిస్తున్నారు.

ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ గోల్కొండ నర్సయ్యను కలిసి ఎన్నికల ఏర్పాట్లపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. పోలింగ్ సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఇంజనీర్ నాగశివ, మేనేజర్ ఖాదర్ ఖాన్, సిబ్బంది చెన్నకేశవ, రవితేజ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply