హనుమజ్జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే..!

హనుమజ్జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే..!

  • స్వామి వారికి ప్రత్యేక పూజలు
  • ఎద్దుల పోటీలు ప్రారంభం

చాపాడు, ఆంధ్రప్రభ : మండలంలోని విశ్వనాథపురం గ్రామంలో వెలసిన శ్రీ వీరాంజనేయస్వామి ఆలయంలో జరుగుతున్న 34 వ హనుమజ్జయంతి మహోత్సవాలలో మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ పాల్గొన్నారు. బుధవారం ఆలయానికి విచ్చేసిన ఆయన స్వామివారిని భక్తిశ్రద్ధలతో దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితులు ఆశీర్వచనాలు అందించి ఆయనకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.

రెండు రోజులుగా హనుమజ్జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల సందర్భంగా భజనలు, కీర్తనలు, కోలాటాలు, ట్రాక్టర్ రివర్స్, పోటీలు, ఎద్దులతో బండలాగుడు పోటీలు, వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వాహకులు ఏర్పాటు చేసి విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. అందులో భాగంగా ఎమ్మెల్యే స్వయంగా రాతి దూలాన్ని ఎద్దులతో లాగించేందుకు ఆ బండపై నిలుచుని ఆయన పోటీలను ప్రారంభించారు. అంతకు ముందు ఎమ్మెల్యే రాక సందర్భంగా గ్రామ ప్రజలు, భక్తులు, టీడీపీ నాయకులు ఘన స్వాగతం పలికారు.

స్థానిక టీడీపీ నాయకులు కార్తిక్ రెడ్డి ఎమ్మెల్యేకు శాలువా కప్పి, పూలమాలలతో సన్మానించి తమ అభిమానాన్ని చాటుకున్నారు.పోటీలలో పాల్గొన్న యువకులను అభినందిస్తూ, గ్రామీణ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి పిచ్చిపాటి. మునిశేఖర్ రెడ్డి, మండల టీడీపీ అధ్యక్షులు వైవీ సుబ్బారెడ్డి, కేసీ కెనాల్ ప్రాజెక్టు వైస్ చైర్మన్ డి.గురివిరెడ్డి, ఎపీ ఐడిసి డైరెక్టర్ అన్నవరం సుధాకర్ రెడ్డి, సోసైటీ చైర్మన్ ఎం. నరసింహరెడ్డి, ఆలయ కమిటీ మాజీ చైర్మన్ డి.వీరశేఖర్ రెడ్డి, రాజువారిపేట వెన్నుపూస కిషోర్ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, టీడీపీ నాయకులు, యువకులు, గ్రామ పెద్దలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply