Nandyala | బండి కాదు మొండి ఇది.. సాయం పట్టండి…
ఆర్టీసీ బస్సు పనితీరు ఇది…
నంద్యాల బ్యూరో, జనవరి 30 : ఈ కంప్యూటర్ యుగంలో కూడా ఆర్టీసీ పనితీరు ఎలా ఉందంటే ఆర్ అంటే రాదు అని, టీ అంటే తెలియదని సీ అంటే చెప్పలేమనే విధంగా ఆర్టీసీ బస్సుల వ్యవహారం ఉందని ప్రజలు వాపోతున్నారు. ఇందుకు నిదర్శనంగా నంద్యాల బస్టాండ్ ప్రాంతంలో గురువారం ఉదయం విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. కొత్త సెమి లగ్జరీ ఆర్టీసీ బస్సు ఆత్మకూరు నుంచి కడపకు వెళ్లే బస్సు నంద్యాల ఆర్టీసీ బస్టాండ్ ముందరినె ఆగిపోవడం విశేషం.
ఇది కొత్త బస్సు అయినప్పటికీ ఎందుకు ఆగిపోయిందో ప్రయాణికులకు అర్థం కాలేదు. బస్టాండ్ ముందర బస్సు ఆగిపోవడంతో ప్రయాణీకులు బస్సును తోయటం ప్రారంభించారు. ఇది చూసిన ప్రజలు ఆర్టీసీ పనితీరు మారదా అంటూ ప్రశ్నించుకోవడం విశేషం. ఆర్టీసీ అధికారులను ప్రశ్నించగా.. సర్వీస్ సరిగా నిర్వహించకపోవడం వల్ల ఆగిపోయిందని తెలపడం విశేషం.