21stMayeditorial | యుద్ధ విరమణకు సిద్ధమవుతున్న అమెరికా

21stMayeditorial | యుద్ధ విరమణకు సిద్ధమవుతున్న అమెరికా

21stMayeditorial | ఇరాన్ యుద్ధంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం
ప్రజల్లో పెరుగుతున్న అసహనం.. నిరసనల బాటలో అమెరికన్లు
ఇరాన్‌తో ఒప్పందం కుదిరే అవకాశాలపై వాన్స్ వ్యాఖ్యలు
యుద్ధం కొనసాగితే మరింత నష్టం తప్పదా?

21stMayeditorial | ఇరాన్‌తో యుద్ధానికి త్వరలో ముగింపు పలకబోతున్నట్టు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సూచనప్రాయంగా తెలిపారు. ఇరాన్‌తో యుద్ధం శాశ్వతం కాదని ఆయన అన్నారు. ఒప్పందానికి ఇరాన్ సిద్ధంగా ఉన్నట్టు తమకు సంకేతాలు వచ్చాయని, దీనిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉందని పేర్కొన్నారు. ఇది ముమ్మాటికీ శుభవార్తే. ఇరాన్ యుద్ధంలో ఇరు దేశాలూ బాగా నష్టపోయాయి. ఇరాన్ యుద్ధ దృశ్యాలను నిరంతర వార్తా స్రవంతుల్లో రోజూ వీక్షిస్తున్న వారికి ఈ విషయం ఈపాటికే అర్థమై ఉంటుంది. ఇరాన్‌లో పెద్ద నాయకులంతా హతమయ్యారు. ఇరాన్ ఆయుధాలు, యుద్ధ ట్యాంకులు అన్నీ చిన్నాభిన్నమయ్యాయి. అలాగే మరోవైపు అమెరికాకు చెందిన 42 యుద్ధ విమానాలు ధ్వంసమైనట్టు అమెరికా సీఆర్ఎస్ నివేదిక వెల్లడించింది. అమెరికాలో యుద్ధం కోసం ఆయుధాలకు కేటాయించిన సొమ్ము పక్కదారి పట్టినట్టు ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ స్వయంగా వెల్లడించారు.

అమెరికాలో కూడా యుద్ధాన్ని వ్యతిరేకించేవారు అనేక మంది ఉన్నారు. వివిధ నగరాల్లో వారు నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. యుద్ధం కారణంగా నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. దౌత్యపరంగా ఇరాన్‌తో ఒప్పందం కుదుర్చుకునేందుకు అధ్యక్షుడు ట్రంప్ ఇప్పటికీ ఎదురు చూస్తున్నారని వాన్స్ అన్న మాటల్లో అమెరికా యుద్ధ విరమణకు సిద్ధంగా ఉందన్న అభిప్రాయం స్పష్టమవుతోంది. చర్చలు విఫలమైతే సైనిక చర్య ఎలాగూ తప్పదన్న విషయాన్ని ఇరాన్ ప్రభుత్వానికి స్పష్టం చేసినట్టు వాన్స్ తెలిపారు.

ఇరాన్-అమెరికా యుద్ధం వల్ల దేశవ్యాప్తంగా ఇంధన ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. యుద్ధంతో సంబంధం లేని దేశాలు కూడా పెట్రోల్, గ్యాస్ ధరలను, నిత్యావసర వస్తువుల ధరలను భరించలేక అల్లాడుతున్నాయి. వార్తాపత్రికల్లో, న్యూస్ చానళ్లలో ఇందుకు సంబంధించిన సమాచారం రోజూ వెలువడుతూనే ఉంది. యుద్ధాల వల్ల ప్రపంచంలో ఏ ఒక్క దేశమూ బాగుపడింది లేదు. ఈ యుద్ధం వల్ల అగ్రరాజ్యమైన అమెరికాలో సైతం ప్రజలు విలవిల్లాడుతున్నారు. ప్రజల్లో సహనం నానాటికీ నశిస్తోంది. ముఖ్యంగా ఆర్థిక భారం పెరిగిపోవడంతో ప్రజలు ఈ యుద్ధం ఎప్పుడు ముగుస్తుందా అని ఎదురుచూస్తున్నారు.

ఇరాన్ తరఫున చర్చలకు వచ్చిన ప్రతినిధులు ఇరాన్‌లో యుద్ధ విరమణకు, లెబనాన్‌లో పరిస్థితికి లింకు పెట్టడం ఏమాత్రం సమంజసం కాదని వాన్స్ అన్నారు. దీని వల్ల ఇరాన్‌తో ఒప్పందం ఏనాడో కుదిరి ఉండేదని ఆయన వ్యాఖ్యానించారు. లెబనాన్ హెజ్బొల్లాతో యుద్ధం కొనసాగుతుందని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ స్పష్టం చేస్తున్నారు. ఇరాన్‌లో పరిస్థితికి, లెబనాన్‌లో పరిస్థితికీ చాలా తేడా ఉందని ఈ విషయంలో ఇరాన్ ప్రతినిధులకు స్పష్టంగా తెలియజేసినట్టు వాన్స్ పేర్కొన్నారు.

ప్రజల్లో సహనం నశిస్తోంది. ఇరాన్ నాయకులు ప్రజల వైపు నుంచి ఆలోచించి యుద్ధ విరమణకు ముందుకు రావాలన్న వాన్స్ పిలుపులో సమంజసం ఉంది. ఇరాన్‌లో యుద్ధం ప్రారంభమై ఆరు వారాలు అవుతోంది. వేలాది మంది మరణించారు. ఎన్నో భవనాలు శిధిలమయ్యాయి. వ్యాపార సంస్థలు కుప్పకూలాయి. ఇరాన్‌లో పరిస్థితి పాకిస్తాన్‌ను పోలి ఉంది. ఈ సమయంలో యుద్ధాన్ని కొనసాగించడం ప్రజల జీవితాలతో చెలగాటమాడుకోవడమేనన్న వాన్స్ మాటల్లో నిజం ఎంతో ఉంది.

Leave a Reply