2026 IPL | 700+ పరుగుల మార్క్‌ను దాటేశారు

2026 IPL | 700+ పరుగుల మార్క్‌ను దాటేశారు

2026 IPL | ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : ఐపీఎల్ (Indian Premier League) 2026లో బ్యాట‌ర్ల హ‌వా కొన‌సాగింది. ఈ సీజ‌న్‌లో బ్యాట్స్‌మెన్స్ అద‌ర‌గొడుగున్నారు. ఫోర్లు, సిక్స‌ర్ల వ‌ర్షం కురిపిస్తున్నారు. బౌల‌ర్ల మీద పూర్తి ఆధిప‌త్యం ప్ర‌ద‌ర్శిస్తున్నారు. ఈ సీజన్‌లో బ్యాటర్ల ఆధిపత్యం స్పష్టంగా కనిపించగా, అనేక రికార్డులు బద్దలయ్యాయి. అయితే ఈ సీజ‌న్‌లో ముగ్గురు బ్యాటర్లు 700కు పైగా పరుగులు నమోదు చేయడం అరుదైన రికార్డుగా నిలిచింది. ఐపీఎల్ చరిత్రలో ఒకే సీజన్‌లో ముగ్గురు ఆటగాళ్లు 700+ పరుగుల మార్క్‌ను అందుకోవడం ఇదే తొలిసారి. ఈ ఘనతను రాజ‌స్థాన్ ప్లేయ‌ర్ వైభ‌వ్‌, గుజ‌రాత్ ఆట‌గాళ్లు గిల్‌, సాయి సుద‌ర్శ‌న్ సాధించారు. ఇందులో వైభ‌వ్ సూర్య‌వంశీ 776 పరుగులతో అగ్రస్థానంలో నిలవగా, శుభ‌మ‌న్ గిల్ 722 పరుగులు, సాయి సుద‌ర్శ‌న్‌ 710 పరుగులు చేశారు.

అంతేకాకుండా, గుజరాత్ జట్టు ఓపెనర్లు గిల్‌, సాయి సుద‌ర్శ‌న్ వైభ‌వ్‌ను దాటే అవ‌కాశం ఉంది. వీరిద్ద‌రూ ఫైన‌ల్ మ్యాచ్ ఆడ‌నున్నారు. కాబ‌ట్టి టోర్నీలో హ‌య్యెస్ట్ స్కోరు చేసే బ్యాట్స్‌మెన్‌గా ఎవ‌రు నిలుస్తారో తెల‌వాలంటే ఫైన‌ల్ మ్యాచ్ జ‌రిగే వ‌ర‌కు వేచి చూడాల్సిందే.

Leave a Reply